Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మై ఓ మూమెంట్-లైఫ్ స్టైల్ క్లబ్ ను ప్రారంభించిన మ‌హేష్ బాబు

Advertiesment
మై ఓ మూమెంట్-లైఫ్ స్టైల్ క్లబ్ ను ప్రారంభించిన మ‌హేష్ బాబు
, శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (12:48 IST)
mahesh- life style club
మహేష్ బాబు ఫిట్‌నెస్‌కు ప్రాధాన్య‌త ఇస్తాడ‌న్న విష‌యం తెలిసిందే. సినిమా షూటింగ్‌లే కాకుండా ఇత‌ర కార్యక్రమాల్లోనూ ఆయ‌న పాల్గొంటున్నారు. శుక్ర‌వారంనాడు జూబ్లీహిల్స్‌లో “మై ఓ మూమెంట్” అనే లైఫ్ స్టైల్ క్లబ్ ను మ‌హేష్‌బాబు ఆవిష్క‌రించారు. అందులో ఫిట్ నెస్, న్యూట్రిషన్, ఫీజియోథెరపీ వంటి సేవలను అందించనున్నారు. “ఫిట్‌నెస్ కోసం నా అన్వేషణలో ప్రపంచంలోని అత్యుత్తమ శిక్షకులతో పనిచేసే అవకాశం నాకు లభించింది. గాబ్రియేల్ మినాష్ ఆ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఫిట్‌నెస్, న్యూట్రిషన్, ఫిజియోథెరపీ, రికవరీని అందించే లైఫ్‌స్టైల్ క్లబ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉంది” అంతో మహేష్ బాబు ట్వీట్ చేశారు.
 
webdunia
mahesh- life style club
ప్రస్తుతం మహేష్ బాబు `సర్కారు వారి పాట‌` సినిమా షూటింగ్ లో వున్నారు. ఇటీవ‌లే కాంగ్రెస్ ఎం.పి. శశి థరూర్ కూడా సెట్‌కు హాజ‌ర‌య్యారు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ మూవీగా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ప‌రిస్థితులు అన్నీ అనుకూలిస్తే జనవరి 13న ఈ మూవీ థియేటర్లలోకి తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తో న‌టిగా మారిన గాయ‌ని చిన్మయి