Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు.. ఉచిత ప్రయాణం

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (11:56 IST)
హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇవి పలు పర్యాటక ప్రాంతాలను చుట్టుకుని వచ్చేలా నడుపనున్నారు. ఈ బస్సులు తిరిగే రూట్ మ్యాప్‌ను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎం‌డీఏ కమిషనర్ అరవింద్ కుమార్ బుధవారం ఓ ట్వీట్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. మొత్తం రూ.12.96 కోట్లతో గతంలోనే ఆరు డబుల్ డెక్కర్ బస్సులను హెచ్ఎండీఏ కొనుగోలు చేసింది. 
 
ఇపుడు ఈ బస్సుులు తిరిగే మార్గాలను ఎంపిక చేశారు. ఈ బస్సులు ట్యాంక్‌బండ్‌, బిర్లామందిర్‌, అసెంబ్లీ, సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, మక్కా మసీద్‌తోపాటు తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్కు, దుర్గం చెరువు, తీగల వంతెన, ఐటీ కారిడార్‌, ఫైనాన్షియల్‌ జిల్లా మార్గాల్లో నడుపనున్నారు. ఉదయం ట్యాంక్‌ బండ్‌ వద్ద బయలుదేరి ఆయా రూట్లలో తిరుగుతూ తిరిగి ట్యాంక్‌ బండ్‌కు చేరుకుంటాయి. ఛార్జింగ్‌ కోసం ఖైరతాబాద్‌ ఎస్టీపీ, సంజీవయ్య పార్కులో ప్రత్యేక పాయింట్లు ఏర్పాటుచేశారు.
 
అయితే, తొలుత ఈ బస్సులను ప్రయోగాత్మకంగా నడుపనున్నారు. ఆ సమయంలో బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. కొన్ని రోజుల తర్వాత కనీస చార్జీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఒక్కో ట్రిప్పునకు ఒక్కొక్కరికి రూ.50 చొప్పున వసూలు చేసే అవకాశం ఉందని, ఎప్పటి నుంచి ప్రయాణ టిక్కెట్‌ను అందుబాటులోకి తీసుకుని రావాలన్న విషయాన్ని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments