Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి మళ్లీ హౌస్ అరెస్టు : ప్రగతి భవన్లు - ఫామ్‌హౌస్‌లు బద్ధలైపోతాయ్...

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (13:25 IST)
తెలంగాణ రాష్ట్ర పాలకులకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డిని తెలంగాణ పోలీసులు మరోమారు హౌస్ అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమానికి పోకుండా పోలీసులతో అడ్డుకున్నారు. దీంతో ఆయన్ను మరోమారు ఇంటికే పరిమితం చేశారు. 
 
ఈ చర్యపై రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. పౌర స్వేచ్ఛను కేసీఆర్ పోలీసులతో సహకారంతో అణిచివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్‌కు వెన్నులో వణుకు మొదలైందన్నారు. తాము ఇంట్లో నుంచి బయటకు అడుగుపెడితే కేసీఆర్‌కు ముచ్చెమటలు పోస్తున్నాయని, అందుకే పోలీసులను ఉసిగొల్పుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడం తప్పా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. నీవు, నీ మంత్రులూ ఎలాగూ రైతులను పరామర్శించలేరు. ఆ ధైర్యం కూడా మీకు లేదు. ఆ పని తాము చేస్తుంటే నీకొచ్చిన నొప్పి ఏందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు, కీడు కార్యాలకు వెళ్లి గంటల సమయం గడిపే నీకు రైతుల చావు కేకలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. త్వరలోనే ఈ ప్రగతి భవన్లు, ఫామ్‌హౌస్‌లు బద్ధలైపోతాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments