Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీడియానా, అయ్య బాబోయ్.. వద్దు వెళ్ళిపోండంటూ రేవంత్ రెడ్డి, ఎందుకు?

Advertiesment
Revanth Reddy
, సోమవారం, 8 నవంబరు 2021 (22:35 IST)
కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున కుటుంబ సమేతంగా స్వామిసేవలో పాల్గొన్నారు. విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్సించుకుని మ్రొక్కులు తీర్చుకున్నారు.

 
అయితే దర్సనం తరువాత బయటకు వచ్చి ఎప్పుడూ మీడియాతో మాట్లాడే రేవంత్ రెడ్డి ఎవరితోను మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తన పుట్టినరోజు సంధర్భంగా తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే రేవంత్ రెడ్డి సైలెంట్‌గా వెళ్ళిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

 
తాజాగా హుజరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని చవిచూడడం.. అందులోను ఓట్లు కూడా చాలా తక్కువగా రావడంతో రేవంత్ రెడ్డిపై అధిష్టానం ఆగ్రహంతో ఉందట. గత కొన్నిరోజుల ముందే జరిగిన సమావేశంలో కూడా దీనిపై ప్రస్తావన జరిగింది. తెలంగాణాలో పటిష్టంగా ఉండే కాంగ్రెస్ ప్రస్తుతం ఎందుకు పుంజులేకపోతోందని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారట కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు.

 
దీంతో ఆలోచనలో పడ్డారట రేవంత్ రెడ్డి. హుజరాబాద్ ఎన్నికల తరువాత సైలెంగ్ గానే ఉంటూ వస్తున్నారు. గతంలో అదే హుజరాబాద్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అభ్యర్థికి 60 వేల ఓట్లు వస్తే ప్రస్తుతం జరిగిన అదే నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కేవలం 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

 
దీంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు దీనిపై మరింత సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏది మాట్లాడినా ప్రజల్లో చులకన భావన వచ్చేస్తుందన్న ఆలోచనతోనే రేవంత్ రెడ్డి తిరుమలలో మీడియా ప్రతినిధులు కనిపించిందే.. అయ్య బాబోయ్.. మీడియానా.. నేను మాట్లాడను.. వెళ్ళండి ప్లీజ్ అంటూ ప్రాథేయపడ్డారట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రహ్మంగారి కాలజ్ఞానం: తోక బాలుడు పుట్టాడు