Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోషల్ మీడియాకు గుడ్ బై.. సమంత షాకింగ్ నిర్ణయం

Advertiesment
సోషల్ మీడియాకు గుడ్ బై.. సమంత  షాకింగ్ నిర్ణయం
, శుక్రవారం, 5 నవంబరు 2021 (10:07 IST)
నాగచైతన్యతో విడాకులు తీసుకొని సమంత అభిమానులందరికీ షాక్ ఇచ్చింది. విడాకుల న్యూస్ తెలుగు ఇండస్ట్రీనే కాదు కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ నటులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే విడాకుల తరువాత సమంతపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేసిన సంగతి.. ఆమె కొన్ని యూట్యూబ్ చానెళ్ల పై కేసుపెట్టిన సంగతి కూడా తెలిసిందే.. 
 
అయితే సమంత మరో షాకింగ్ నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం.. ఈ షాకింగ్ డెసిషన్ ఏంటంటే.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలని, ఫోటోలను షేర్ చేసుకునే సమంత త్వరలో సోషల్ మీడియాకు గుడ్ బై  చెప్పబోతున్నట్లు సమాచారం. విడాకులు తీసుకున్నప్పటి నుండి ఏదొక విషయంలో సమంతను నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకుందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. 
 
చైతన్యతో  విడాకుల తరువాత సమంత పై చాలా కారణాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే ఎప్పటికపుడు వారికి పరోక్షంగా స్పందిస్తూ వచ్చిన సమంత.. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే.. ఈ కామెంట్ల పట్ల కొంచెం అయిన ఉపశమనం దొరుకుందని భావిస్తోందట.. 
 
సమంత ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలోఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఇదెంత వరకు నిజమో..? నిజంగానే సమంత సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పబోతుందా..??  తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై చంద్రంకు అరబ్ ఎమిరేట్స్ 'గోల్డెన్ వీసా'