దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు సంఖ్యలో తగ్గుదల కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా 15 వేలకు దిగువున నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా దేశంలో కొత్తగా 12,729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,33,754కు చేరింది.
ప్రస్తుతం దేశంలో 1,48,922 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,59,873 మంది మరణించగా, 3,37,24,959 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. అయితే, గత 2020, మార్చి తర్వాత యాక్టివ్ కేసుల రేటు కనిష్టానికి చేరింది.
ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.43 శాతంగా ఉండగా, కరోనా రికవరీ రేటు 98.23 శాతానికి పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 221 మంది మరణించగా, 12,165 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.