Publish Date: Wed, 03 Nov 2021 (10:41 IST)
Updated Date: Wed, 03 Nov 2021 (10:42 IST)
దేశంలో కొత్తగా మరో 11,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,08,140కు చేరింది. ఇందులో 1,51,209 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 252 రోజుల్లో ఇదే అతితక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాగా, మొత్తం కేసుల్లో 3,36,97,740 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని, మరో 4,59,191 మంది మహమ్మారికి బలయ్యారని తెలిపింది. గత 24 గంటల్లో 311 మంది మరణించగా, 14,159 మంది కరోనా నుంచి బయటపడ్డారని వెల్లడించింది.
రికవరీ రేటు 98.22 శాతంగా ఉంది. నిన్న కరోనా వల్ల 311 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటివరకు 61.12 కోట్ల కరోనా టెస్టులు చేశారు. 107.29 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు.