Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్దిక శాఖలోకి వాణిజ్య పన్నులను కలిపేశార‌ట‌! ఏదైనా గ‌వ‌ర్న‌ర్ పేరిటే!!

Advertiesment
ఆర్దిక శాఖలోకి వాణిజ్య పన్నులను కలిపేశార‌ట‌! ఏదైనా గ‌వ‌ర్న‌ర్ పేరిటే!!
విజ‌య‌వాడ‌ , బుధవారం, 3 నవంబరు 2021 (09:50 IST)
ఆర్థిక శాఖ పరిధిలోని కి కొత్తగా వాణిజ్య పన్నుల శాఖను కూడా చేర్చామని, దీని ద్వారా రెవెన్యూ ఆర్ధిక  శాఖలన్నీ ఒకే చోట ఉండాల‌నే సదుద్దేశంతోనే ప్రభుత్వం ఈ మార్పులు చేసిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. విజయవాడ యనమలకుదురు రోడ్డులోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో వాణిజ్య పన్నుల అధికారులతో ఆయా శాఖల పనితీరును మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో పన్నుల వసూళ్లకు సంబంధించిన డీలర్ బేస్ పై ప్రాథమికంగా చర్చించామని మంత్రి అన్నారు. 
 
 
అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా సక్రమంగా నిర్వహించాలని భావిస్తున్నానని, అందుకే ఈ రోజు వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఈ శాఖను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇదే తరహా వ్యవస్థ ఉందని మంత్రి అన్నారు. జీఎస్టీ వచ్చిన తరువాత ఈ విభాగాలు ఆర్థిక శాఖలో కలవడం కూడా ముఖ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటివరకూ 3,274 కోట్లు జీఎస్టీ నిధులు కేంద్రం ఇచ్చిందని,  ఇంకనూ రాష్ట్రానికి రెండు వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉందన్నారు.
 
రాజ్యాంగపరంగా గవర్నరుకు సంక్రమించిన అధికారాలు మేరకు ఎలాంటి ఒప్పందాలు అయినా గవర్నరు పేరునే జరుగుతాయని, గత ప్రభుత్వాలు ఎవరి పేరుతో అప్పులు చేశారని మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై కాగ్ అభ్యంతరాలు అత్యంత సామాన్య‌మని, వాటికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే ఉందని మంత్రి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ పెట్టిందే రాష్ట్రంలో పెట్టిన సంక్షేమపథకాలు అమలు కోసమే అని మంత్రి అన్నారు. ఏ ఎస్ డి సి తీసుకున్న రుణాలతో తో అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, వైయస్సార్ ఆసరా వంటి పథకాలకు ఖర్చు చేస్తుందన్నారు. కోవిడ్ కారణంగా దేశంలోనూ, అంతర్జాతీయంగానూమనం ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. ఉద్యోగుల జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యం అయినా చెల్లిస్తున్నామని ఈ విషయంలో ఉద్యోగుల సహకారం ఉందని మంత్రి అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి అన్నారు. 
 
 
భూములు తనఖా పెట్టి బ్యాంకు రుణాలు తీసుకోవడం అత్యంత సహజమని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో పేదలకు ఇబ్బంది పడకూడదని సంక్షేమ పథకాల ద్వారా డబ్బు ఇచ్చామని మంత్రి అన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక శాఖకు అనుబంధంగానే వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు ఉండేవని మంత్రి అన్నారు. పరిపాలన అంతా గతంలోనూ ఇప్పుడు గవర్నర్ పేరు మీదే జరుగుతున్నాయని, ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేస్తున్నాయని మంత్రి అన్నారు. ప్రభుత్వం అప్పులు చేసినా, జీవోలు జారీ చేసినా గవర్నర్ పేరు మీద జరుగుతాయని అది ప్రభుత్వ విధానమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
 
 
ఈ సమావేశంలో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవి, సేల్స్ టాక్స్ స్పెషల్ కమిషనర్ రవి శంకర్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హుజురాబాద్ బైపోల్ : 172 పోలింగ్‌ కేంద్రాల్లో కాంగ్రెస్‌కు సింగిల్‌ డిజిట్‌..