యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ పిల్లలను పాఠశాలకు పంపే విషయంపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా విన్నపం చేసారు. అందులో.. ఆమె... కేటీఆర్ సర్, కరోనా కారణంగా లాక్ డౌన్ ఫాలో అయ్యాము. కేసులు తగ్గుతుండటంతో లాక్ డౌన్ ఎత్తేశారు. వ్యాక్సినేషన్ చేస్తున్నారు.
ఐతే చిన్నపిల్లలకి ఇంకా టీకా కార్యక్రమం పూర్తి కాలేదు. ఈలోపు ఆయా స్కూలు యాజమాన్యాలు పిల్లల్ని స్కూళ్లకి పంపాలని ఒత్తిడి చేస్తున్నారు. అంతేకాదు... ఒకవేళ కరోనా వచ్చినా తమ బాధ్యత కాదంటూ సంతకాలు చేయించుకుంటున్నారు. చెప్పండి సర్... ఇదెక్కడి న్యాయం? దీనిపై మీరు సమీక్షిస్తారని భావిస్తున్నాను అంటూ పేర్కొన్నారు.