టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలను పెద్ద ఎత్తున చేయాలని, భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ పనుల్లో, పార్టీ నేతలతో సమావేశాలతో మంత్రి, టి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజీబిజీ అయిపోయారు. మంత్రి కేటీఆర్ తో పాటు సమావేశాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ప్లీనరీ, తెలంగాణ విజయ గర్జనపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ భవన్ లో మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో కేటీఆర్ సమావేశమై దిశా నిర్దేశం చేశారు.
కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, రాజ్య సభ సభ్యులు కేశవరావు, చేవెళ్ల లోక్‌సభ సభ్యులు రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణి దేవి, కుర్మయ్యగారి నవీన్ కుమార్, యోగానంద్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ తీగల అనిత దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.