Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జనవరిలో తప్పుకోనున్న ఆర్థికవేత్త గీతా గోపీనాథ్

జనవరిలో తప్పుకోనున్న ఆర్థికవేత్త గీతా గోపీనాథ్
, బుధవారం, 20 అక్టోబరు 2021 (14:06 IST)
Gita Gopinath
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ తన విధుల నుంచి వచ్చే ఏడాది జనవరిలో తప్పుకోనున్నారు. ఈ మేరకు ఐఎంఎఫ్ ప్రతినిధులు తెలిపారు. అలాగే సంస్థకు కొత్త ముఖ్య ఆర్థికవేత్తను త్వరలోనే ప్రకటిస్తామని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా తెలిపారు.
 
జార్జివా మాట్లాడుతూ సంస్థకు గీత అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆమె అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారన్నారన్నారు. పలు ముఖ్య కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించారని తెలిపారు.
 
భారత్‌లోని మైసూరులో జన్మించిన గోపీనాథ్.. ఐఎంఎఫ్ తొలి మహిళా చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమితులయ్యారు. చీఫ్ ఎకనామిస్ట్‌‌ బాధ్యతలు చేపట్టే సమయానికి ఆమె.. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆమె హార్వర్డ్ యూనివర్సిటీకే తిరిగి వెళ్లనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావళి బోనస్_ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్