Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏఐఓఐ- ప్రొఫెసర్‌ జయశంకర్‌ ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ డిజిటల్‌ కోర్సు

Advertiesment
ఏఐఓఐ- ప్రొఫెసర్‌ జయశంకర్‌ ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ డిజిటల్‌ కోర్సు
, సోమవారం, 4 అక్టోబరు 2021 (18:59 IST)
ఇటీవల జరిగిన ఓ వర్ట్యువల్‌ కార్యక్రమంలో, ఏఐఓఐ మరియు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజెటీఎస్‌ఏయు) ఓ ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సును ఆర్గానిక్‌ ఉత్పత్తులలో నైపుణ్య మరియు వ్యవస్ధాపకత అభివృద్ధి కోసం ఆవ్కిరించింది.

ఈ కోర్సును లాంఛనంగా సంతోష్‌ సారంగి, అడిషనల్‌ సెక్రటరీ, భారతప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార శాఖ కార్యదర్శి శ్రీ ఎం రఘునందన్‌ రావు; పీజెటీఎస్‌ఏయు వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ వి ప్రవీణ్‌ రావు;  ఏఐఓఐ ఛైర్మన్‌ శ్రీ రాజ్‌ శీలం మరియు ఏఐఓఐ సీఈవో డాక్టర్‌ పీవీఎస్‌ఎం గౌరి పాల్గొన్నారు.
 
ఏఐఓఐ యొక్క ఈ కార్యక్రమ లక్ష్యం, ఆర్గానిక్‌ కార్యకలాపాలకు సంబంధించి నిర్ధిష్టమైన విభాగాలలో నైపుణ్యం కలిగిన మానవ వనరులతో ఆర్గానిక్‌ పరిశ్రమ అవసరాలను తీర్చడం. ఈ కోర్సును ప్రత్యేకంగా ఆత్మనిర్భర్‌ (వ్యవస్థాపకత) ప్రోత్సహించడంతో పాటుగా ఆర్గానిక్‌ పరిశ్రమలో ఉపాధి కోసం సాధికారితను ప్రోత్సహించేందుకు తీర్చిదిద్దారు.
 
శ్రీ సంతోష్‌ సారంగి, అడిషనల్‌ సెక్రటరీ మాట్లాడుతూ, ‘‘మొట్టమొదటిసారిగా ఓ ప్రైవేట్‌ రంగ సంస్థతో ఓ వ్యవసాయ  విశ్వవిద్యాలయం భాగస్వామ్యం చేసుకోవడాన్ని ప్రశంసిస్తున్నాము. ఇది భారతదేశంలో ఆర్గానిక్‌ విప్లవాన్ని మరింతగా తీసుకురానుంది అని అన్నారు. చురుగ్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఏఐఓఐ సభ్యులను అభినందించిన ఆయన ఆర్గానిక్‌ పరిశ్రమకు మద్దతునందించడం ద్వారా భారతదేశంలో ఆర్గానిక్‌ ఆహార పరిశ్రమను శక్తివంతం చేసేందుకు సామర్ధ్య నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.
 
అదే రీతిలో ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధ్యం చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను సైతం వృద్ధిచేయగలమన్నారు. పరిశోధన, సాంకేతికతల వాణిజ్యీకరణపరంగ, అలాగే ఆర్గానిక్‌ రంగ అవసరాల పట్ల అవగాహన మెరుగుపరచడంలో ఇది ఎంతో దూరం వెళ్లనుందన్నారు. ఆర్గానిక్‌ రంగ బలోపేతం కోసం సామర్ధ్య నిర్మాణ మరియు అభివృద్ధి కోసం అత్యంత అవసరమైన కార్యక్రమమిది’’ అని అన్నారు.
 
శ్రీ  ఎం రఘునాధన్‌ రావు, సెక్రటరీ- వ్యవసాయ మరియు సహకార అభివృద్ధి, తెలంగాణా ప్రభుత్వం మాట్లాడుతూ, ‘‘ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విస్తరణ కార్మికులు ఈ రంగంలో ఔత్సాహికులకు శిక్షణ అందించేందుకు ఈ తరహా కార్యక్రమాలను ప్రారంభించగలిగితే ఇది సేంద్రీయ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున స్వీకరించడానికి దారి తీస్తుంది’’ అని అన్నారు.
 
డాక్టర్‌ ప్రవీణ్‌ రావు, వీసీ, పీజెటీఎస్‌ఏయు మాట్లాడుతూ, సేంద్రీయ వ్యవసాయంలో అతి పెద్ద సవాల్‌గా నిలిచే అంశాలలలో చీడ పీడల నియంత్రణ నిలుస్తుందన్నారు. కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్‌, డ్రోన్‌ సాంకేతికతను భారీస్థాయిలో వినియోగించడానికి ఈ కరిక్యులమ్‌లో జోడించనున్నామన్నారు.
 
ఏఐఓఐ  ఛైర్మన్‌ అండ్‌ డైరెక్టర్‌ రాజ్‌ శీలం మాట్లాడుతూ, ‘‘ప్రపంచ వ్యాప్తంగా సేంద్రీయ ఉత్పత్తులకు 110కు పైగా బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ ఉంది. ఇది 8-10% వృద్ధి నమోదుచేస్తుంది. 2020-2021లో ఇండియా దాదాపు ఒక బిలియన్‌ డాలర్ల ఆర్గానిక్‌ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. సరైన విధానాలు, ప్రయత్నాలు ఉంటే దీనిని 10 బిలియన్‌డాలర్లకు వృద్ధి చేయవచ్చు. భారతీయ మార్కెట్‌ సైతం 20-25% వృద్ధి చెందుతూ భారీ అవకాశాలను అందిస్తుంది. ఈ అవకాశాలను అత్యుత్తమంగా వినియోగించుకుని సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్‌ను వృద్ధి చేసుకోవచ్చు. దీనికోసం ముడిపదార్ధాల సరఫరా వృద్ధి చేయడంతో పాటుగా సరైన నైపుణ్యాలలతో సేంద్రీయ వ్యవసాయం అర్థం  చేసుకోవడం’’ అవసరం అని అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ ‘‘ఏఐఓఏ ఇప్పుడు పీజెఎస్‌టీఏయు తో భాగస్వామ్యం చేసుకుని ఆన్‌లైన్‌ సేంద్రీయ కోర్సును ఆవిష్కరించింది. దీనిద్వారా మరింత మంది యువత ముందుకు రావడంతో పాటుగా సేంద్రీయ ఉద్యమం ప్రారంభం కావడానికి మరియు సేంద్రీయ రంగంలో పనిచేయడానికి ఆసక్తి కలిగిన వారికి మరింతగా ఈ రంగాన్ని అర్ధం చేసుకునేందుకు తోడ్పడుతుంది. భవిష్యత్‌లో మరిన్ని  కోర్సులను జోడించనున్నాం’’ అని అన్నారు.
 
డాక్టర్‌ పీవీఎస్‌ఎం గౌరీ, సీఈవో, ఏఐఓఐ తన స్వాగతోపన్యాసంలో సేంద్రీయ పరిశ్రమకు ప్రభుత్వం మద్దతు అందించడంతో పాటుగా ఆరోగ్య, సంక్షేమ ఉత్పత్తులపై వినియోగదారులు చేసే ఖర్చు సైతం పెరిగిందని,అందువల్లసేంద్రీయ ఉత్పత్తుల సామర్థ్యం పెరగడంతో పాటుగా లాభదాయకత కూడా పెరుగుతుందన్నారు. ఈ అవకాశాలను వినియోగించుకోవడానికి పరిశ్రమకు నైపుణ్యవంతులైన మానవ వనరులు కావాల్సి ఉందన్నారు. అదే సమయంలో ఫార్మ్‌ టు ఫోర్క్‌ ప్రతి అంశంలోనూ సేంద్రీయ ఉత్పత్తుల సమగ్రతను సైతం తెలుసుకోవాల్సి ఉందన్నారు.
 
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్గానిక్‌ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు, రైతు అసోసియేషన్లు,  ఎగుమతి దారులు, సర్టిఫికేషన్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా ఎన్నికలకు మాకు ఎలాంటి సంబంధం లేదు : పేర్ని నాని