Publish Date: Thu, 30 Sep 2021 (13:21 IST)
Updated Date: Thu, 30 Sep 2021 (13:23 IST)
సివిల్స్ ఇంటర్వ్యూలో 9వ ర్యాంకర్ డాక్టర్ అపల రికార్డు సృష్టించారు. గతేడాది నమోదైన రికార్డును ఆమె చెరిపేశారు. ఇంటర్వ్యూలో 275 మార్కులకు గానూ అపల 215 మార్కులు సాధించింది. గత సంవత్సరం ఇంటర్వ్యూలో అత్యధికంగా 212 మార్కులు వచ్చాయి. సివిల్స్ ఫలితాలు గత వారం విడుదల కాగా, మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కులను మంగళవారం విడుదల చేసింది యూపీఎస్సీ.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన డాక్టర్ అపల మూడో ప్రయత్నంలో 9వ ర్యాంకు సాధించింది. ఆమె ఇంటర్వ్యూ 40 నిమిషాల పాటు సాగింది. అన్ని ప్రశ్నలకు అపల సమాధానం ఇచ్చారు. ఇంటర్వ్యూ ప్రారంభంలో కొద్దిగా ఆందోళనకు గురైనప్పటికీ.. తర్వాత తనలో ఆత్మ విశ్వాసం పెంపొందించుకున్నానని అపల చెప్పుకొచ్చారు.
అలా అన్ని ప్రశ్నలకు తడబడకుండా సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇంటర్వ్యూ రౌండ్ అనేది చాలా ప్రధానమైనది అని తెలిపారు. తమ ప్రెజెంటేషన్‌తో పాటు పర్సనాలిటీ స్కిల్స్‌ను బోర్డు మెంబర్లు పరిశీలిస్తారని తెలిపారు.