Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్: తెలంగాణ దూసుకెళ్లింది..!

దేశంలో విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్: తెలంగాణ దూసుకెళ్లింది..!
, గురువారం, 9 సెప్టెంబరు 2021 (17:40 IST)
నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేం వర్క్(ఎన్‌ఐ‌ఆర్‌ఎఫ్) 2021 నివేదిక విడుదలైంది. ఆన్లైన్ వేదికగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిపోర్ట్ విడుదల చేశారు. ఆరు అంశాల ఆధారంగా దేశం లోని విశ్వవిద్యాలయాలు, కాలేజీలకు ఈ నివేదిక ద్వారా ర్యాంకులు ప్రకటించారు. ఇంజనీరింగ్, మెడికల్,డెంటల్ సహా మొత్తం పదకొండు కేటగిరీల్లో ర్యాంకులని ప్రకటించారు.
 
ఓవరాల్ కేటగిరీలో మొదటి ర్యాంక్ ఐఐటీ మద్రాస్ సాధించిగా… రెండో ర్యాంక్ ఐఐఎస్‌సీ బెంగళూరు సాధించింది. యూనివర్సిటీల కేటగిరీలో మొదటి స్థానాన్ని ఐ ఐ ఎస్ సీ బెంగళూరు మొదటి స్థానం సాధించగా హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీ 9 వ స్థానాన్ని సాధించింది.
 
ఇంజనీరింగ్ విభాగం లో ఐఐటీ మద్రాస్ మొదటి స్థానం సాధించగా ఐఐటీ, హైదరాబాద్ 7వ స్థానం సాధించింది. మెడికల్ కేటగిరీలో ఢిల్లీ ఎయింస్ మొదటి స్థానం సాధించగా… లా కేటగిరీలో హైదరాబాద్‌లోని నల్సార్‌లా యూనివర్సిటీ 3వ స్థానాన్ని కైవసం చేసుకొంది.
 
టాప్ 100 విభాగంలో తెలంగాణ, ఏపీకి చెందిన పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు చోటు సంపాదించుకున్నాయి. పలు కేటగిరీలవారీగా కూడా ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు. ఈ ర్యాంకులను ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ప్రతియేటా విడుదల చేస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా విడుదల చేసింది.
 
విశ్వవిద్యాలయాలు
మొదటి స్థానం: బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ యూనివర్సీటీ (ఐఐఎస్‌యూ)
ఆరోస్థానం: హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ (హెచ్‌సీయూ)
ఆంధ్రా విశ్వవిద్యాలయం 24వ ర్యాంక్‌, ఎస్వీ విశ్వవిద్యాలయం 54వ ర్యాంక్‌
 
పరిశోధన విభాగం
కర్ణాటకలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు తొలి ర్యాంక్
హైదరాబాద్ ఐఐటీకి 15వ ర్యాంక్‌
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 25వ ర్యాంక్‌
 
ఫార్మసీ
హైదరాబాద్ నేషనల్ ఫార్మా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌కు ఆరో ర్యాంక్
కాకతీయ విశ్వవిద్యాలయం 48వ ర్యాంక్
అనురాగ్ విశ్వవిద్యాలయం 61
విష్ణు ఇన్‌స్టిట్యూట్‌కు 72
 
ఆంధ్రప్రదేశ్‌
ఏయూ ఫార్మా కళాశాలకు 30వ ర్యాంక్‌
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి 40వ ర్యాంక్
ఎస్వీ విశ్వవిద్యాలయానికి 54
రాఘవేంద్ర ఇన్‌స్టిట్యూట్‌కు 55వ ర్యాంక్
చలపతి ఇన్‌స్టిట్యూట్‌కు 69వ ర్యాంక్‌
 
కళాశాలలు
తెలంగాణ: నల్సార్ విశ్వవిద్యాలయానికి మూడో ర్యాంక్, ఇక్పై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ 29
 
ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో
వరంగల్ నిట్‌ (NIIT)కు 59వ ర్యాంక్, ఐఐటీ హైదరాబాద్‌కి 16, సెంట్రల్
యూనివర్సిటీకి 17, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 62, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి 48, ఎస్వీ విశ్వవిద్యాలయానికి 92
 
మెడికల్ కళాశాల విభాగం
నారాయణ వైద్య కళాశాలకు 43వ ర్యాంక్‌
 
ఆర్కిటెక్చర్ విభాగం
ఏపీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ 8వ ర్యాంక్,
 
మేనేజ్‌మెంట్
గుజరాత్‌ ఐఐఎమ్‌కు మొదటి ర్యాంక్
ఇక్ఫై హైదరాబాద్‌కు 27వ ర్యాంక్
ఏపీలోని కేఎల్ ఇంజనీరింగ్ కళాశాలకు 38వ ర్యాంక్‌
క్రియా విశ్వవిద్యాలయానికి 50వ ర్యాంక్‌
తెలంగాణలోని ఐఐఎమ్ టీకి 63వ ర్యాంక్ వచ్చాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ భారీ ర్యాలీ: ఎంపీ రామ్మోహన్ నాయుడు అరెస్ట్