Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోస్టు మార్టం నిర్వహిస్తుండగా, గురక శబ్ధం వినిపించింది..

పోస్టు మార్టం నిర్వహిస్తుండగా, గురక శబ్ధం వినిపించింది..
, సోమవారం, 26 జులై 2021 (12:43 IST)
పోస్టు మార్టం నిర్వహిస్తుండగా, గురక శబ్ధం వినిపించింది. పోస్ట్‌ మార్టం నిర్వహించే రూమ్‌లో గురక శబ్దం ఎక్కడనుంచి వస్తుందా అని ఆ డాక్టర్ పరిసరానలు పరిశీలించి చూస్తుండగా.. ఉన్నట్టుండి మృతదేహం లేచి కూర్చుంది. అంతే డాక్టర్ల బృందానికి గుండె ఆగిపోయిందా? అన్నట్లుగా బిగుసుకుపోయారు. ఈ ఘటనతో డాక్టర్లు షాకయ్యారు.
 
వివరాల్లోకి వెళితే.. జనవరి 7, 2018లో స్పెయిన్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న గొంజలో మోంటోయా జిమెనెజ్ అనే ఖైదీ ఉన్నట్లుండి స్పృహ కోల్పోయాడు. దీంతో అధికారులు అతడిని లేపటానికి ఎన్నో రకాలుగా యత్నించారు. కానీ అతడిలో ఎలాంటి చలనం లేదు. 
 
దాంతో జైలులో డ్యూటీలో ఉన్న ఇద్దరు డాక్టర్లను పిలిచి పరిక్షించారు. అతనిని పరీక్షించిన డాక్టర్లు చనిపోయినట్లు తెలిపారు. కానీ అధికారులు మరోసారి నిర్ధారించుకున్నాక తదుపరి కార్యక్రమం చేద్దామనుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణుడిని పిలిపించి మరోసారి పరీక్షలు చేయించారు. అతను కూడా ఖైదీ చనిపోయాడని తెలిపారు.
 
ఇక అధికారిక నియమాల ప్రకారం ఖైదీ డెబ్ బాడీని ప్యాక్ చేయించి మార్చురీ కోల్డ్ స్టోరేజ్‌లో భద్రపరిచారు. శవపరీక్ష నిర్వహించడానికి అతని మృతదేహాన్ని స్కాల్పెల్ గుర్తులతో గుర్తించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిర్వహించడానికి డాక్టర్లు మార్చురీలోకి వచ్చారు. అక్కడ వారికి పెద్ద గురక శబ్దం వినిపించింది. శవాలు మాత్రమే ఉండే ఆ రూమ్ లో గురక శబ్ధం ఏంటాని రూమ్ అంతా పరిశీలనగా చూశారు.
 
మృతదేహం ఉన్న బ్యాగ్ లోపలి నుంచి గురక వస్తోందని తెలుసుకున్నారు. చనిపోయాడని డాక్టర్లతో పాటు ఫోరెన్సిక్ నిపుణుడు కూడా ధ్రువీకరించి.. కోల్డ్‌ స్టోరేజ్‌లో పెట్టిన తర్వాత గొంజలో శరీరంలో చలనం వచ్చింది. వెంటనే అతడి బాడీని ఆసుపత్రికి తరలించగా అతను ప్రాణాలతోనే ఉన్నాడని డాక్టర్లు గుర్తించారు. 
 
ఈ సందర్భంగా హాస్పిటల్ అధికారులు మాట్లాడుతూ 'ఇటువంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని మానవ శరీరం బందీకావడం లేదా ట్రాన్స్ లాంటి దశలోకి ప్రవేశించి స్పృహ, అనుభూతిని కోల్పోతుంది. ఫలితంగా సదరు వ్యక్తి మరణించినట్లు నిర్ధారిస్తాం' అని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రాక్టర్ నడుపుకుంటూ పార్లమెంట్‌కు వచ్చిన రాహుల్ గాంధీ