Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్రాక్టర్ నడుపుకుంటూ పార్లమెంట్‌కు వచ్చిన రాహుల్ గాంధీ

ట్రాక్టర్ నడుపుకుంటూ పార్లమెంట్‌కు వచ్చిన రాహుల్ గాంధీ
, సోమవారం, 26 జులై 2021 (12:14 IST)
కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దూకుడు ప్రదర్శిస్తున్నారు. కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని, పెట్రో ధరల పెరుగదలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ ఆయన సోమవారం ట్రాక్టర్‌ను నడుపుకుంటూ స్వయంగా పార్లమెంట్‌కు వచ్చారు. 
 
రైతుల సందేశాన్ని తాను పార్లమెంటుకు తీసుకొచ్చానని ఈ సందర్భంగా రాహుల్ అన్నారు. రైతన్నల గొంతులను కేంద్ర ప్రభుత్వం నొక్కేస్తోందని... రైతు సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. 
 
ఈ కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యాపారవేత్తల కోసమే ఈ చట్టాలను తీసుకొచ్చారనే విషయం యావత్ దేశానికి తెలుసని చెప్పారు. 
 
కొత్త వ్యవసాయ చట్టాల పట్ల రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారని కేంద్రం చెపుతోందని... ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న వారిని టెర్రరిస్టులు అంటోందని మండిపడ్డారు. రైతుల హక్కులను కేంద్రం అణచివేస్తోందని అన్నారు.
 
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 19న ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమావేశాలకు ఒక రోజు ముందే పెగాసస్ స్పైవేర్ అంశం తెరపైకి వచ్చింది. దీంతో, పార్లమెంటు ఉభయసభలు ఈ అంశంపై దద్దరిల్లుతున్నాయి. గత వారం ఐదు రోజుల పాటు సమావేశాలు జరుగుతున్నప్పటికీ.. ఉభయ సభల్లో ఒక్క గంట కూడా సజావుగా జరిగిన దాఖలాలు లేవు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాతో హీరోయిన్‌గా నటిస్తావా? జయంతితో సీనియర్ ఎన్టీఆర్