ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అవినీతి చోటుచేసుకున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. దీంతో రఫేల్ జెట్ల కొనుగోలు వ్యవహారం ఇపుడ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని ప్రధాని మోడీని ఉద్దేశించి రాహుల్ ఓ కౌంటర్ వేశారు.
ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేస్తూ చోర్ కీ దాడీ (దొంగ గడ్డం) అంటూ కామెంట్ చేశాడు. ఆ ఫొటోలో రఫేల్ విమానం నుంచి వచ్చిన పొగ మోడీ గడ్డంలా కనిపిస్తోంది. రఫేల్ డీల్‌పై ఫ్రాన్స్ న్యాయ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో మరోసారి ఈ అంశాన్ని తెరపైకి వచ్చింది.
ఈ డీల్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మొదటి నుంచీ రఫేల్ డీల్‌లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్‌తోపాటు రాహుల్ గాంధీ ఆరోపిస్తూనే ఉన్నారు. తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం ఆదేశించిన ఈ విచారణతో తాము చెప్పిందే నిజమైందని కాంగ్రెస్ వాదిస్తోంది.