Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ద్విగ్విజయంగా సాగిన కెనడా- అమెరికా తెలుగు సదస్సు

Advertiesment
ద్విగ్విజయంగా సాగిన కెనడా- అమెరికా తెలుగు సదస్సు
విజయవాడ , గురువారం, 30 సెప్టెంబరు 2021 (13:09 IST)
ద్విగ్విజయంగా సాగిన కెనడా- అమెరికా తెలుగు సదస్సులో  50 % కెనడియన్ రచయితలు, 50% అమెరికా రచయితలు పాల్గొని కవితల రూపంలోనూ, కథల రూపంలోనూ, ప్రసంగాల రూపంలోనూ తమ ప్రతిభని వెలిబుచ్చారు. ఈ సదస్సుతో అమెరికా-కెనడా రచయితల మధ్య పరిచయాలు, సత్సంబంధాలు పెరిగి, ఉత్తర అమెరికా తెలుగు సాహిత్యం మ‌రింత  ప్రతిష్టమయింది. ఈ విషయమై మొదటిసారి సదస్సులో పాల్గొన్న అనేకమంది కెనడా రచయితలు తమ హర్షం వ్యక్తపరిచారు. సరిహద్దు గీతని చెరిపేస్తూ, కెనడా అమెరికా రచయితలందరూ సంబరంగా జరుపుకున్న ఇటువంటి పండుగలు తరచూ జరగాలని, మునుముందు కూడా రెండు దేశాలూ కలిసి సదస్సులు నిర్వహించాలనీ అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులూ ఆశాభావం వ్యక్తం చేసారు. 
 
ఈ సదస్సుని 12 వేదికలుగా విభజించగా, ప్రతి వేదిక నిర్వహకులూ, సాంకేతిక నిపుణులూ,  తమ వేదిక మీద ప్రసంగించాల్సిన అనేక మంది రచయితలతో కలిసి సమావేశాలు నిర్వహించి, సందేహ నివృత్తి చేసి, జూం నిర్వహణలో అంతరాయం కలగకుండా, సభని అతి సమర్థవంతంగా నిర్వహించారు. సభని అందంగా తీర్చిదిద్దడం లో జూం హోస్ట్ ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచారు.  సదస్సుల విషయంలో అనుభవం లేని మమ్మల్ని వేలు పట్టుకుని నడిపిస్తూ, ఎంతో ఓర్పుతో  ప్రతి విషయాన్నీ వివరిస్తూ, అతి క్లిష్టమైన విషయాలని సులభంగా పరిష్కరిస్తూ,  సహనానికి మారుపేరేమో అనిపించిన గురుతుల్యులు వంగూరి చిట్టెన్రాజు గారికి కెనడా తెలుగువారి తరఫున అనేక ధన్యవాదాలు. 
 
లక్ష్మీ రాయవరపు, తెలుగు తల్లి కెనడా వెబ్ మాసపత్రిక సంపాదకురాలు కృషి, అకుంఠిత దీక్ష, మొక్కవోని సంకల్పం ఈ సదస్సుకి చాలా శోభమానమైంది. కెనడా మినిష్టరు ప్రసాద్ పండా, తనికెళ్ళ  భరణి, సుద్దాల అశోక్ తేజ, వడ్డేపల్లి కృష్ణ, డేనియల్ నాజర్గా, భువనచంద్ర, బలభద్రపాత్రుని రమణి, మహెజబీన్ సదస్సుకి హజరై తమ ప్రసంగాలతో ప్రేక్షకులనలరించారు. 
 
వంగూరి ఫౌండేషన్, తెలుగుతల్లి కెనడా వెబ్ మాస పత్రిక ముఖ్య నిర్వాహకులుగా, టొరాంటో తెలుగు టైంస్, ఓంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగు వాహిని, ఆటవా తెలుగు అసోసియేషన్, కాల్గేరీ తెలంగాణా అసోసియేషన్, తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరాంటో కలిసి ఈ సదస్సుని విజయవంతంగా నిర్వహించాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ సైనికుల‌పై రక్షణ మంత్రికి లేఖ పంపిన ఏపి బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు