Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐఐటీ జెఈఈ మెయిన్స్‌ 2021లో అత్యున్నత ర్యాంకులను సాధించిన అన్‌అకాడమీ విద్యార్థులు

ఐఐటీ జెఈఈ మెయిన్స్‌ 2021లో అత్యున్నత ర్యాంకులను సాధించిన అన్‌అకాడమీ విద్యార్థులు
, మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (18:43 IST)
ఆన్‌లైన్‌ అభ్యాస వేదిక అన్‌అకాడమీ కు చెందిన డజన్ల కొద్దీ విద్యార్థులు ఐఐటీ జెఈఈ మెయిన్స్‌ పరీక్ష 2021లో అత్యున్నత ర్యాంకులను  సాధించారు. అన్‌ అకాడమీ విద్యార్ధి అమియా సింఘాల్‌, ఈ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించడంతో పాటుగా 100 పర్సంటైల్‌ సాధించాడు.
 
మొత్తంమ్మీద అన్‌అకాడమీకి చెందిన 102 మంది విద్యార్థులు ఐఐటీ జెఈఈ మెయిన్స్‌ 2021 వద్ద అత్యున్నత ర్యాంకులను సాధించారు. ఒకటి నుంచి 1000 లోపు ర్యాంకులను 14 మంది విద్యార్థులు సాధించగా, 18 మంది అన్‌ అకాడమీ విద్యార్థులు 99.9 పర్సంటైల్‌కు పైన మార్కులు సాధించారు. 70 మంది విద్యార్థులు 99.5 పర్సంటైల్‌ పైన సాధించారు.
 
అమియా సింఘాల్‌ (ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 1) మాట్లాడుతూ, మూడేళ్లు తాను ఈ ర్యాంక్‌ కోసం తీవ్రంగా శ్రమించానన్నాడు. ‘‘తన 11, 12 వ గ్రేడ్‌ సమయంలో తన ఆశయం పరంగా అస్సలు నిరుత్సాహానికి గురి కాకుండా ఉండటమే అత్యంత కష్టసాధ్యమైన అంశంగా నిలిచింది. కానీ తాను సానుకూలంగా ఉంటూనే, రెగ్యులర్‌గా మాక్‌ టెస్ట్‌లకు హాజరవుతూ, గత  సంవత్సర ప్రశ్నాపత్రాలను పూరించడం చేశాను. అన్‌అకాడమీ వద్ద నున్న ప్రత్యక్ష తరగతులు, రికార్డెడ్‌ తరగతులు నాకు ఓ వరంలా నిలిచాయి. నా వ్యూహాలను మరింత ఉత్తమంగా మలుచుకునేందుకు ఇవి తోడ్పడ్డాయి’’ అని అన్నారు
 
అన్‌అకాడమీ విద్యార్ధి బ్రతిన్‌ మండల్‌, 100 పర్సంటైల్‌తో ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 18 సాధించాడు. అతను మాట్లాడుతూ, ఆన్‌లైన్‌ అభ్యాసం పట్ల  తాను అనుసరించే మార్గాన్ని సమూలంగా అన్‌ అకాడమీ మార్చిందన్నాడు. అన్‌అకాడమీ వద్ద అభ్యాసం అత్యున్నత అనుభవంగా పేర్కొన్న అతను అన్‌అకాడమీ విద్యావేత్తలు, సమగ్రమైన కోర్సులు, టెస్ట్‌ సిరీస్‌ దీనికి దోహదం చేస్తున్నాయన్నాడు. అన్‌అకాడమీ ద్వారా కరోనా మహమ్మారి కాలంలో కూడా తాను ఉత్తమంగా ిసిద్ధం కావడం సాధ్యమైందన్నాడు.
 
ఈ ప్రతిష్టాత్మకమైన విజయం సాధించిన తరువాత విద్యార్థులు త్వరలో జరుగనున్న ఐఐటీ జెఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల కోసం అన్‌అకాడమీపై సిద్ధమవుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తండ్రి అక్రమ సంబంధం బయటపెట్టిన కుమార్తె, ఉరి వేసి చంపేశాడు