Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోడ్‌ చెఫ్‌ స్నాక్‌డౌన్‌ 2021ను ప్రకటించిన అన్‌అకాడమీ: 19 అక్టోబర్‌ 2021 వరకూ రిజిస్ట్రేషన్లు

కోడ్‌ చెఫ్‌ స్నాక్‌డౌన్‌ 2021ను ప్రకటించిన అన్‌అకాడమీ: 19 అక్టోబర్‌ 2021 వరకూ రిజిస్ట్రేషన్లు
, గురువారం, 16 సెప్టెంబరు 2021 (22:21 IST)
భారతదేశపు సుప్రసిద్ధ అభ్యాస వేదిక అన్‌అకాడమీ వినూత్నమైన మల్టీ రౌండ్‌ ప్రోగ్రామింగ్‌ పోటీ తమ 6వ ఎడిషన్‌ స్నాక్‌డౌన్‌‌ను ప్రకటించింది. ఈ పోటీ అన్ని పాఠశాలలు, కాలేజీ విద్యార్థులతో పాటుగా వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు తెరిచి ఉంచారు.
 
స్నాక్‌డౌన్‌ను 2010వ సంవత్సరంలో కోడ్‌చెఫ్‌ ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ ప్రోగ్రామర్లు ఒకరితో ఒకరు పోటీపడటమే లక్ష్యంగా దీనిని ఆరంభించారు. అన్‌అకాడమీ, ఈ కోడ్‌ చెఫ్‌ కస్టోడియన్‌షిప్‌ను జూన్‌ 2020లో తీసుకుంది.
 
రిజిస్ట్రేషన్‌ మరియు షెడ్యూల్‌
స్నాక్‌డౌన్‌ 2021 కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇవి అక్టోబర్‌ 19,2021 వరకూ తెరిచి ఉంచబడతాయి. మొదటి ఆన్‌లైన్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్‌ పోటీలు 14 అక్టోబర్‌ నుంచి 19 అక్టోబర్‌ వరకూ జరుగనున్నాయి. ఈ పోటీ గ్రాండ్‌ ఆన్‌లైన్‌ ఫైనల్‌  09 జనవరి 2022 తేదీ జరుగనుంది. పూర్తి షెడ్యూల్‌ మరియు అభ్యాస వనరులు వెబ్‌సైట్‌ వద్ద లభ్యమవుతాయి.
 
గ్రాండ్‌ప్రైజ్‌లు
ఈ సంవత్సరం స్నాక్‌డౌన్‌2021, గత వెర్షన్‌లలా కాకుండా మహమ్మారి కారణంగా వ్యకులకు మాత్రమే పోటీ నిర్వహిస్తారు. స్నాక్‌డౌన్‌ 2021 చాంఫియన్‌ 10000 డాలర్లు అందుకోగలరు. దీనితో పాటు స్నాక్‌డౌన్‌ గోల్డ్‌ ట్రోఫీ కూడా అందుకోగలరు. మొదటి రన్నరప్‌ మరియు సెకండ్‌ రన్నరప్‌లు వరుసగా 7500 మరియు 5వేల డాలర్లను అందుకోగలరు. వీటితో పాటుగా ట్రోఫీలు, మర్చండైజ్‌ కూడా అందుకోగలరు. టాప్‌ 10 ఇండియన్‌ ప్రోగ్రామర్లు మరియు 4 నుంచి 25  గ్లోబల్‌ ర్యాంక్‌ హోల్డర్లు నగదు బహుమతులు పొందగలరు.
 
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రోగ్రామర్లు స్నాక్‌డౌన్‌ 2021 వెబ్‌సైట్‌  చూడటంతో పాటుగా తమంతట తాముగా నమోదు చేసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రాలో 'మిషన్ 2024' : మంత్రివర్గ ప్రక్షాళనకు త్వరలో శ్రీకారం (video)