భారతదేశంలో అతిపెద్ద అభ్యాస వేదిక యుఎన్ అకాడమీ నేడు తాము క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంతకాలు చేసినట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్య ప్రధాన లక్ష్యం యుఎన్ అకాడమీ అభ్యాసకులకు సమగ్రమైన అభ్యాసం అందించడం.
ఈ డీల్‌లో భాగంగా, యుఎన్ అకాడమీ అభ్యాసకులకు లెజండ్ శిక్షణ మరియు మెంటారింగ్‌ను పలు ప్రత్యక్ష ఇంటరాక్టివ్ తరగతులు ద్వారా చేస్తారు. వీటిని యుఎన్ అకాడమీ వేదికపై ప్రతి ఒక్కరూ ఉచితంగా పొందవచ్చు. ఈ సుప్రసిద్ధ క్రికెటర్ ఇప్పుడు యుఎన్ అకాడమీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించనున్నారు.
యుఎన్ అకాడమీ వద్ద మా లక్ష్యమెప్పుడూ కూడా విద్యను ప్రజాస్వామ్యీకరించడం, సమగ్రమైన అభ్యాస పరిష్కారాలను అందించడం. ఇది విద్యకు సంబంధించి సంప్రదాయ రూపాలకు ఆవల ఉంటుంది. సచిన్ యొక్క జీవితం, ప్రయాణాలు విలువలతో కూడి ఉండటంతో పాటుగా ఎన్నో అవరోధాలు, అసమానతలతో ధైర్యంగా పోరాడినట్లుగా ఉంటుంది.
ఈ భాగస్వామ్యంతో మేము సాటిలేని అభ్యాస అనుభవాలను సృష్టిస్తున్నాం. దీనిలో సచిన్ తన జీవిత పాఠాలను మా అభ్యాసకులతో పంచుకోవడంతో పాటుగా వారికి తగిన శిక్షణనూ అందిస్తారు. మేము లోతైన కంటెంట్ ఆధారిత భాగస్వామ్యం అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాము. రాబోయే కొద్ది నెలల్లో ఈ ఫలితాలు వెల్లడికానున్నాయి అని గౌరవ్ ముంజాల్, కో-ఫౌండర్ అండ్ సీఈఓ, యుఎన్ అకాడమీ గ్రూప్ అన్నారు.
క్రీడల యొక్క శక్తి పట్ల నేనెప్పుడూ నమ్మకంతోనే ఉన్నాను. ఇవి కేవలం ప్రజలను ఏకం చేయడం మాత్రమే కాదు విలువైన పాఠాలనూ బోధిస్తాయి. అవి వ్యక్తులకు తమ జీవితంలో పలు దశలలో తోడ్పడతాయి. గేమ్‌కు సంబంధించి నేను నేర్చుకున్న అంశాలను పంచుకోవడానికి నేనెప్పుడూ ఆసక్తిగానే ఉంటుంటాను. యువతతో వాటిని పంచుకోవడం వల్ల వారు స్ఫూర్తిని పొందడంతో పాటుగా తమను తాము మెరుగుపరుచుకోగలరు.
ఓ అభ్యాస వేదికగా యుఎన్ అకాడమీ ఎప్పుడూ కూడా భౌగోళిక హద్దులను ఏకం చేయడంతో పాటుగా భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే నేర్చుకునే అవకాశం అందిస్తుంది. నా లక్ష్యం, యుఎన్ అకాడమీ యొక్క మిషన్‌తో సరిపోలడం ద్వారా ఇది విద్యను ప్రజాస్వామ్యీకరిస్తుంది. మేము ఇప్పుడు వినూత్నమైన అభ్యాస అనుభవాలను సృష్టించడానికి ఏకతాటిపైకి రాబోతున్నాం అని సచిన్ టెండూల్కర్, పూర్వ భారత క్రికెటర్, ఛేంజ్ మేకర్ అన్నారు.
ఈ భాగస్వామ్యంలో భాగంగా, యుఎన్ అకాడమీ ఇప్పుడు లోతైన కంటెంట్‌ను అభివృద్ధి చేయడంతో పాటుగా దానిని క్రీడా అభ్యాస విభాగంలో మిళితం చేస్తుంది. దానిని రాబోయే కొద్ది నెలల్లో ఆవిష్కరించనున్నారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా గుర్తించబడిన సచిన్ టెండూల్కర్ నవంబర్ 2013లో తమ 200వ టెస్ట్ మ్యాచ్‌ను వెస్టండీస్‌తో ముంబైలోని వాఖేండ్ స్టేడియంలో ఆడటం ద్వారా రిటైర్ అయ్యారు. ఆయన తన టెస్ట్ అరంగేట్రంను నవంబర్ 1989లో చేశారు. కరాచీలో పాకిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌లో తన 16వ ఏట అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సచిన్, తన 24 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో భారతదేశానికి రెండుసార్లు కెప్టెన్‌గా వ్యవహరించారు.
సచిన్‌కు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను 2014లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందించారు. ఆయన రిటైర్‌మెంట్ తరువాత, మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు దాతృత్వకారిగా మారడంతో పాటుగా ఇన్వెస్టర్-ఎంటర్‌ప్రిన్యూర్‌గానూ మారారు. యువతకు మెంటార్‌గా వ్యవహరిస్తూనే సానుకూల మరియు మరింత ప్రకాశవంతమైన భారతావనిని సృష్టిస్తున్నారు.