Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24 మంత్ర ఆర్గానిక్‌ హెర్బల్‌, టీ, ఆయుర్వేద జోడింపుతో రెడీ టు కుక్‌ బ్రేక్‌ఫాస్ట్‌

Advertiesment
24 మంత్ర ఆర్గానిక్‌ హెర్బల్‌, టీ, ఆయుర్వేద జోడింపుతో రెడీ టు కుక్‌ బ్రేక్‌ఫాస్ట్‌
, మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (16:18 IST)
మీ బ్రేక్‌ఫాస్ట్‌లో రుచి, ఆరోగ్యం, సౌకర్యంల సమ్మేళనం లేక ఇబ్బంది పడుతున్నారా? తప్పనిసరిగా ఉండాల్సిన ఈ అంశాలలో ఏది లేకపోయినా రాజీపడుతున్నారా? అయితే మీరిప్పుడు 24 మంత్ర యొక్క నూతన ఆర్గానిక్‌, రెడీ టు కుక్‌ బ్రేక్‌ఫాస్ట్‌ శ్రేణితో ఆశ్చర్యపోండి. రైతుల నుంచి నేరుగా ఎంపిక చేసిన ఆర్గానిక్‌ పదార్ధాలతో తయారుచేయబడిన ఈ నూతన శ్రేణి కేవలం మీ శరీరానికి అవసరమైన పోషకాలను మాత్రమే కలిగి ఉండటం మాత్రమే కాకుండా మీ రోజును శక్తివంతంగా ఆరంభించండి. ఈ బ్రేక్‌ఫాస్ట్‌ శ్రేణిలో మిల్లెట్‌ దోశ మిక్స్‌, పొంగల్‌, హోల్‌ మూంగ్‌ కిచిడీ, కాండా పోహ, రాగి ఇడ్లీ మిక్స్‌ మరియు గోజు అవలక్కీ వంటివి ఉన్నాయి.
 
ఇది అక్కడితో ఆగదు! 24 మంత్ర ఇప్పుడు పన్నెండు రకాల ఆర్గానిక్‌, హెర్బల్‌, ఆయుర్వేదిక్‌ ఇన్‌ఫ్యూజన్స్‌ వంటి అస్సామ్‌ టీ, గ్రీన్‌ టీ, తులసి, తులసి గ్రీన్‌ టీ, తులసి జింజర్‌, తులసి జింజర్‌ టర్మరిక్‌‌లను సైతం విడుదల చేసింది. ఈ రెడీ టు కుక్‌ శ్రేణి 200 గ్రాముల ప్యాక్‌లు 90 రూపాయల నుంచి 120 రూపాయల శ్రేణిలో ఉంటాయి. ఈ టీలు మరియు ఇన్‌ఫ్యూజన్స్‌ 25 శాచెట్స్‌లో ఉంటాయి. ఇవి 160 రూపాయలు, 250 రూపాయల ధరలో ఉంటాయి. ఈ ఉత్పత్తులన్నీ భారతదేశ వ్యాప్తంగా 24 మంత్ర ఫార్మ్‌ షాప్స్‌లో లభ్యమవుతాయి.
 
ఈ నూతన ఆవిష్కరణ గురించి ఎన్‌ బాలసుబ్రమణియన్‌, సీఈవో, 24 మంత్ర ఆర్గానిక్‌ మాట్లాడుతూ, ‘‘2004లో ఆరంభమైన నాటి నుంచి వినియోగదారులకు స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన ఆహారం అందించడానికి కృషి చేస్తుంది. వృద్ధి చెందుతున్న అవగాహన, ఆర్గానిక్‌ మరియు ఆరోగ్యవంతమైన ఆహారం స్వీకరించాలనే కోరిక ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఆరోగ్యవంతమైన, సౌకర్యవంతమైన భారతీయ బ్రేక్‌ఫాస్ట్‌ ఆవశ్యకత ఉందని మేము గుర్తించాం. అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దిన ఈ శ్రేణి ఉత్పత్తులు మారుతున్న వినియోగదారుల డిమాండ్‌లు, ఈ తరహా ఉత్పత్తుల పట్ల వారి ప్రాధాన్యతలను తెలుపుతాయి’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిజెపికి జనసేన షాక్, కమలనాథుల పనైపోయిందా?