Uppena team, Warangal temple
సినిమా అంటే అంత ఇంతా క్రేజ్ కాదు. యూత్‌కు సినిమా అంటే ఎంత క్రేజో, హీరోహీరోయిన్లు దగ్గరగా వచ్చినప్పుడు అంతకంటే క్రేజ్. హీరోల్లో బేషజం లేకుండా ప్రేక్షకులు ఎగబడడం తెలుగు యూత్ ప్రేక్షకులకు కొట్టిన పిండే. థియేటర్లలో టిక్కెట్లకోసం ఎగబడీ గేట్లు వేసినా గంటల తరబడి ఎదురుచూడటం, గేట్లు ఎప్పుడు తీస్తాడంటూ అక్కడే చర్చించుకోవడం, అవసరమైతే యాజమాన్యంపై దూషణ పదజాలం వాడడం మామూలే. తరాలు మారినా మానవ నైజం మారనట్లు ఇప్పటి యువత కూడా అదే బాటలో వుండడం విశేషం.
ఇక తారాగణం బయటకు వచ్చాక వారిని కలుసుకోవాలని ప్రేక్షకులకు వుంటుంది. అలాంటి సంఘటన వరంగల్‌లో జరిగింది. అక్కడ రాధికా థియేటర్‌కు `ఉప్పెన` చిత్ర యూనిట్ ఇంటర్‌వెల్‌లో హాజరయింది. వారి రాకతో ఒక్కసారిగా యువత థియేటర్లో కోలాహలమే. అందుకు మెగాస్టార్ మేనల్లుడు అనగానే జై చిరంజీవి, పవన్‌నళ్యాణ్ అంటూ నినాదాలు చేస్తూ ప్రేక్షకులు హుషారెత్తించారు. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించి వచ్చింది టీమ్. అందులో హీరోయిన్ కృతికకు చాలా ఆశ్చర్యంగానూ విడ్డూరంగా అనిపించింది. ఇంతటి ఆదరణ నేను ఎక్కడా చూడాలేదంటూ హీరో వైష్ణవ్‌తేజ్‌తో అనడం కూడా మామూలయిపోయింది.
ఇక వరంగల్‌లో వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయంకు చిత్ర యూనిట్ సందర్శించారు. అక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. వీరి రాకతో థియేటర్‌కంటే ఎక్కువగా గుడి పరిసర ప్రాంతాల్లో సందడి ఎక్కువయింది. అందుకే గుడి నిర్వాహకులు గేటు తాళాలు వేసి ఎవరినీ రానీకుండా కట్టడి చేశారు.
అనంతరం బయటకు వచ్చాక ఫోటీలకు అక్కడివారంతా ఫోటీ పడ్డారు. కోవిడ్ నిబంధనలను తుంగలోతొక్కి గుంపులుగా రావడం యూత్‌కే చెల్లింది. ఇక, సినిమాలో తనను ఆదరించకపోతే వేరే రంగంవైపు వెళతానని స్టేట్‌మెంట్ ఇచ్చిన వైష్ణవ్‌తేజ్‌కు ఇదంతా చూశాక ఏమనిపిస్తుందంటారు!