అమెజాన్ ఇండియా నేడు మహీంద్రా ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. దీనిద్వారా దేశంలో విద్యుత్ వాహనాల పట్ల తమ నిబద్ధతను మరింతగా బలోపేతం చేయనుంది. 2020లో అమెజాన్ ఇండియా తమ డెలివరీ వాహనాల ఫ్లీట్ గురించి వెల్లడించడంతో పాటుగా భారతదేశంలో 2025 నాటికి 10వేల విద్యుత్ వాహనాలు (ఈవీ)లను జోడించనున్నట్లు తెలిపింది.
అమెజాన్ సంతకం చేసిన క్లయిమెట్ ప్లెడ్జ్(వాతావరణ ప్రతిజ్ఞ)లో ప్రకటించినట్లుగా అంతర్జాతీయంగా ఒక లక్ష విద్యుత్ వాహనాలను తమ డెలివరీ ఫ్లీట్‌లో 2030 సంవత్సరం నాటికి జోడించాలనే నిబద్ధతకు అనుగుణంగా ఈ ఈవీలు ఉంటాయి. మహీంద్రాతో ఈ భాగస్వామ్యం, ఈ-మొబిలిటీ పరిశ్రమలో భారతదేశ వృద్ధి దిశగా అతి ముఖ్యమైన ముందడుగుగా ఉండటంతో పాటుగా తమ పర్యావరణ సస్టెయినబిలిటీ లక్ష్యాలను చేరుకోవడంలో అతి ముఖ్యమైన ముందడుగా నిలుస్తుంది.
మహీంద్రా ట్రియో జోర్ వాహనాలను ఇప్పటి వరకూ బెంగళూరు, న్యూఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, భోపాల్, ఇండోర్, లక్నో సహా ఏడు నగరాలలో అమెజాన్ ఇండియా యొక్క నెట్‌వర్క్ డెలివరీ సర్వీస్ భాగస్వామ్యాల ద్వారా అందుబాటులోకి వచ్చింది. గత కొద్ది సంవత్సరాలుగా భారతీయ ఈ-మొబిలిటీ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందుతుంది. అత్యాధునిక సాంకేతికత, అత్యున్నత మోటార్ మరియు బ్యాటరీ విడిభాగాలు దీనికి తోడ్పడుతున్నాయి.
అదనంగా, దేశంలో విద్యుత్ వాహనాల స్వీకరణను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దీనిలో భాగంగా గో ఎలక్ట్రిక్ వంటి అవగాహన కార్యక్రమాలనూ చేస్తుంది. దీనిలో భాగంగా ఫేమ్ 2 విధానంలో భాగంగా చార్జింగ్ మౌలక సదుపాయాలను ఏర్పాటుచేయడం వంటివి భారతదేశంలో ఈవీలను వేగంగా రోడ్ల మీదకు తీసుకువచ్చేందుకు కంపెనీకి తోడ్పడుతున్నాయి. అమెజాన్ ఇండియా ఫ్లీట్‌లో ఈ విద్యుత్ వాహనాలను జోడించడమనేది విద్యుత్ వాహనాల పట్ల భారతదేశపు దృష్టికి అనుగుణంగా ఉండటంతో పాటుగా సస్టెయినబల్ ఆత్మనిర్భర్ భారత్ కోసం మేక్ ఇన్ ఇండియాకు అనుగుణంగా ఉంటుంది.
భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, హైవేలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల శాఖామాత్యులు శ్రీ నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, వాతావరణ మార్పులను నివారించడంలో స్వచ్ఛమైన రవాణాకు స్వచ్ఛమైన ఇంధన వినియోగం అత్యంత కీలకం. అమెజాన్ ఇండియా మరియు మహీంద్రా ఎలక్ట్రిక్ నడుమ భాగస్వామ్యం స్వాగతించతగినది. ఈ-మొబిలిటీ పరిశ్రమలో భారతదేశపు వృద్ధిని ఇది పునరుద్ఘాటిస్తుంది. దానితో పాటుగా మా పర్యావరణ సస్టెయినబిలిటీ లక్ష్యాలలో ఆటో మేకర్లు మరియు ఈ-కామర్స్ కంపెనీల బాధ్యతనూ వెల్లడిస్తుంది.
దేశంలో విద్యుత్ వాహనాల స్వీకరణ పరంగా ప్రభుత్వ ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి మరియు దీనితో పాటుగా మరిన్ని కంపెనీలు ఈ-మొబిలిటీ స్వీకరణకు తోడ్పడేందుకు విధాన నిర్ణయాలు కూడా తోడ్పడనున్నాయి. భారతదేశపు శక్తివంతమైన ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ నాయకత్వంతో పాటుగా వ్యవస్ధాపక సంస్కృతి, ప్రపంచ శ్రేణి మౌలిక వసతుల నిర్మాణంలో మా సామర్థ్యం మరియు ఐటీ, తయారీ నైపుణ్యాలు వంటివి అత్యాధునిక మొబిలిటీ పరిష్కారాలలో నాయకత్వ స్థానం పొందడంలోసహాయడనున్నాయి అని అన్నారు.
అఖిల్ సక్సేనా, వీపీ, కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఆపరేషన్స్, ఏపీఏసీ, మెనా అండ్ లాతమ్, అమెజాన్ మాట్లాడుతూ మా కార్యకలాపాల ద్వారా పర్యావరణ ప్రభావం తగ్గించడంపై మా సరఫరా చైన్‌ను నిర్మించాలనే నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది. 2025 నాటికి మా విద్యుత్ వాహనాల సంఖ్యను 10వేలకు వృద్ధి చేయాలనే లక్ష్యం, పరిశ్రమలో సస్టెయినబిలిటీ లీడర్‌గా నిలువాలనే మా ప్రయాణంలో అత్యంత కీలకమైన మైలురాయిగా నిలువనుంది. మేము పలు ఓఈఎంలతో కలిసి పనిచేయడం కొనసాగించడంతో పాటుగా మేడ్ ఇన్ ఇండియా విద్యుత్ వాహనాల ఫ్లీట్‌ను నిర్మించనున్నాం. దానితో పాటుగా మా వినియోగదారుల ఆర్డర్లనూ సురక్షితంగా డెలివరీ చేయనున్నాం. మహీంద్రా ఎలక్ట్రిక్ తో ఈ భాగస్వామ్యం మా నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుంది అని అన్నారు.
2019 సెప్టెంబర్‌లో క్లయిమెట్ ప్రతిజ్ఞ చేసిన మొట్టమొదటి సంస్థగా అమెజాన్ నిలిచింది. 2040 నాటికి తమ వ్యాపారాల వ్యాప్తంగా జీరో కార్బన్ ఉద్గారాలను వెల్లడిస్తామని కంపెనీ వెల్లడించింది. పారిస్ ఒప్పంద లక్ష్యం 2050 కన్నా 10 సంవత్సరాలు ముందుగానే తమ లక్ష్యం సాధిస్తామని సంస్థ వెల్లడించింది. వాతావరణ ప్రతిజ్ఞలో చేరడంతో పాటుగా వేగవంతంగా డీ కార్బనైజింగ్ చేయడం ద్వారా సంతకం చేసిన సంస్థలు అత్యంత కీలకమైన పాత్రను అతి తక్కువ కార్బన్ విడుదల చేసే ఉత్పత్తుల అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టనున్నాయి.
ఇది కంపెనీలు తమ ప్రతిజ్ఞను చేరుకునేందుకు తోడ్పడనుంది. 2040 నాటికి నెట్ జీరో కార్బన్ సాధిస్తామనే వాతావరణ ప్రతిజ్ఞ పట్ల తమ నిబద్ధతకు మద్దతునందించడంలో భాగంగా 10వేల అమెజాన్ కస్టమ్ ఎలక్ట్రిక్ డెలివరీ వాహనాలు అంతర్జాతీయంగా వినియోగదారులకు 2022 నాటికి డెలివరీ చేయడంతో పాటుగా 2030 నాటికి ఒక లక్ష విద్యుత్ వాహనాలు డెలివరీ నెట్‌వర్క్‌లో ఉండనున్నాయి.
మహేష్‌బాబు, ఎండీ అండ్ సీఈవో, మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మాట్లాడుతూ, అమెజాన్ డెలివరీ పార్టనర్స్ ఫ్లీట్‌లో మహీంద్రా ట్రియో జోర్ ఈవీను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అమెజాన్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము గర్వంగా ఉన్నాము. భారతదేశపు లాజిస్టిక్స్ మరియు తుది మైలు డెలివరీ అవసరాలను ఇది సమూలంగా పునర్నిర్వచించనుందని నేను నమ్ముతున్నాను. అదే సమయంలో ఇది మహీంద్రా మరియు అమెజాన్‌లు సస్టెయినబిలిటీ లక్ష్యాలను చేరుకోవడంలోనూ సహాయపడనుంది.
మహీంద్రా ట్రియో జోర్ వినూత్నమైన వినియోగదారుల విలువప్రతిపాదనను అందిస్తుంది. ఇది పరిశ్రమలో అత్యుత్తమంగా 8కిలోవాట్ శక్తి మరియు అత్యున్నత పేలోడ్ 550కేజీలను అందిస్తుంది. ఈ మేడ్ ఇన్ ఇండియా ఎలకి్ట్రక్ కార్గో ఇప్పుడు అమెజాన్ యొక్క డెలివరీ పార్టనర్ ఫ్లీట్ ఈవీ దిశగా మారేందుకు తోడ్పడనుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. మూడు చక్రాల వాహనాలలో మా ట్రియో శ్రేణి విజయం విద్యుత్ వాహనాల పరంగా వినియోగదారులతో పాటుగా భారీ సమాజానికి సైతం పరస్పర ప్రయోజనం కలిగిస్తుందని ఆశిస్తున్నాము అని అన్నారు.
మహీంద్రా ట్రియో జోర్‌ను అక్టోబర్ 2020లో ఆవిష్కరించారు. ఇది అత్యాధునిక లిథియం-అయాన్ బ్యాటరీ కలిగి ఉంది. అతి సులభంగా చార్జ్ కావడంతో పాటుగా పలు ప్రాంతాలలో డెలివరీ భాగస్వాములు దీనిని చార్జ్ చేసుకునే అవకాశమూ ఉంది. అదనపు డిజైన్ ఫీచర్లలో ఆటోమేటిక్‌ట్రాన్స్‌మిషన్, లోడింగ్ మరియు అన్‌లోడింగ్ సమయం తగ్గిచడం ద్వారా అలసట లేని డ్రైవింగ్ అనుభవాలను అందించడం జరుగుతుంది. మహీంద్రా ట్రియో జోర్‌ను భారతదేశంలో డిజైన్ చేసి అభివృద్ధి చేశారు. ఇది పరిశ్రమలో అత్యుత్తమ పనితీరు అందించడంతో పాటుగా పరిశ్రమలో అతి పెద్ద వీల్ బేస్ కలిగి సురక్షిత, స్థిరమైన సవారీని అందిస్తుంది.