Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తండ్రి అక్రమ సంబంధం బయటపెట్టిన కుమార్తె, ఉరి వేసి చంపేశాడు

Advertiesment
father
, మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (18:01 IST)
భార్య బాగా చదువుకుంది. భర్త పెద్దగా చదువుకోలేదు. కుటుంబ పోషణ కోసం ఆమె విదేశాలకు వెళ్ళింది. రెండు చేతులా కష్టపడి సంపాదిస్తూ భర్తతో పాటు పిల్లల కోసం డబ్బులు పంపిస్తూ ఉండేది. భర్తపై నమ్మకంతో తన దగ్గర డబ్బులు పెట్టుకోకుండా మొత్తం భర్తకు పంపించేసేది. దీంతో భర్త పరాయిస్త్రీతో ఎంజాయ్ చేయడమే కాదు డబ్బులను నీళ్ళ లాగా ఖర్చుపెట్టడం మొదలుపెట్టాడు. చివరకు అడ్డంగా దొరికిపోయాడు.
 
తమిళనాడులోని తంజావూరు సమీపంలోని గోరికళం ప్రాంతంలో రంగేశ్వరన్, విజయలక్ష్మిలు నివాసముండేవారు. వీరికి తొమ్మిదేళ్ళ విద్య, ఎనిమిదేళ్ళ విఘ్నేష్ ఉన్నారు. భార్య డబ్బులు సంపాదించడానికి విదేశాలకు వెళ్ళింది. దీంతో రంగేశ్వరన్ పిల్లలతో పాటు ఇంట్లో ఉండేవాడు.
 
గత నాలుగుసంవత్సరాలుగా ఆమె విదేశాల్లో ఉంటూ డబ్బులు సంపాదించి పంపుతూ ఉండేది. ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే స్వదేశానికి వచ్చి వెళ్ళింది విజయలక్ష్మి. భర్తపైన నమ్మకంతో మొత్తం డబ్బులను అతని అకౌంట్‌కే ట్రాన్స్‌ఫర్ చేసేది. అయితే ఆ డబ్బుతో తెగ ఎంజాయ్ చేసేవాడు భర్త.
 
పరాయి స్త్రీలతో శారీరక సంబంధం పెట్టుకోవడం.. నిత్యం మద్యం సేవించడం అలవాటుగా మార్చేసుకున్నాడు. అంతేకాదు స్థానికంగా ఉన్న రజినీ అనే వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుని తరచూ ఆమె దగ్గరకు వెళ్ళేవాడు. ఇది కాస్త చిన్నారి ద్వారా భార్యకు తెలిసింది.
 
భార్య మందలించింది. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు పంపిస్తుంటే ఎంజాయ్ చేస్తున్నావా అంటూ తిట్ల పురాణం మొదలుపెట్టింది. కూతురి ద్వారా విషయం తెలిసిందన్న కోపంతో తండ్రి చిన్నారిని అతి దారుణంగా ఇంట్లో ఉరి వేసి చంపేశాడు. ఆ తరువాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. 
 
అయితే భార్య ఫిర్యాదుతో పోలీసులు పోస్టుమార్టం చేస్తే హత్యగా అసలు విషయం బయటపడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్రమ సంబంధం కాస్త ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెదేపా నేతలను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు