Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో మరింతగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Advertiesment
Covid 19
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మరింతగా తగ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 12,428 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 356 మంది మ‌ర‌ణించారు. క‌రోనా నుంచి మ‌రో 15,951 మంది కోలుకున్న‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. 
 
ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 1,63,816 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కేర‌ళ‌లో నిన్న ఒక్క‌రోజే కొత్త‌గా 6,664 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 53 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేర‌ళ ఆరోగ్య శాఖ తెలిపింది.
 
ఇదిలావుంటే, దేశాన్ని కరోనా వైరస్ ఓ కుదుపు కుదిపింది. ఆ తర్వాత వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అలా వివిధ రకాల వేరియంట్లు కొత్తగా పుట్టుకొస్తాయి. దీంతో ఈ వేరియంట్లపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఏవై.4గా పిలుస్తున్న కరోనా వైరస్‌లోని కొత్త వేరియంట్ మధ్యప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. 
 
ఇండోర్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు ఈ వేరియంట్ బారినపడ్డారు. వీరంతా వ్యాక్సినేషన్ పూర్తయిన వారే కావడం గమనార్హం. వీరందరికీ ఏవై.4 వేరియంట్ సోకిన విషయాన్ని దేశ రాజధానిలోని జాతీయ వ్యాధి నివారణ కేంద్రం నిర్ధారించింది.
 
ఈ వేరియంట్ జన్యు క్రమాన్ని పరిశీలించేందుకు బాధితుల నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. చికిత్స అనంతరం బాధితులు కోలుకున్నట్టు మధ్యప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ ప్రధానాధికారి బీఎస్ సాయిత్య తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా మృతులకు రూ.50 వేల పరిహారం.. ఏపీ సర్కారు నిర్ణయం