Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండేళ్ళ ఆయుర్ధాయం మింగేసిన కరోనా వైరస్

రెండేళ్ళ ఆయుర్ధాయం మింగేసిన కరోనా వైరస్
, ఆదివారం, 24 అక్టోబరు 2021 (10:19 IST)
డ్రాగన్ కంట్రీ చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ మనిషి జీవితాన్ని అనేక విధాలుగా అస్తవ్యస్తం చేసింది. ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్‌లో సగటు ఆయుర్దాయం దాదాపు రెండేళ్ల మేర తగ్గింది ఈ మేరకు ముంబైలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ స్టడీస్‌ (ఐఐపీఎస్‌) శాస్త్రవేత్తలు గణాంకపరమైన విశ్లేషణ చేసి ఈ విషయాన్ని గుర్తించారు.
 
మహమ్మారి కారణంగా జనన సమయంలో సగటు ఆయుర్దాయం అటు పురుషుల్లోను ఇటు మహిళల్లోను తగ్గినట్లు ఈ పరిశోధనలో తేలింది. ఈ నివేదిక మేరకు 2019లో పురుషుల సగటు ఆయుర్దాయం 69.5 ఏళ్లు కాగా.. మహిళల విషయంలో అది 72 ఏళ్లుగా ఉండేది. 2020లో అది 67.5 ఏళ్లు (పురుషులకు), 69.8 ఏళ్ల (మహిళలకు) తగ్గింది. 
 
కొవిడ్‌-19 మహమ్మారి.. 39-69 ఏళ్ల వయసున్న పురుషుల ప్రాణాలను ఎక్కువగా హరించింది. దీనివల్ల సగటు ఆయుర్దాయం పడిపోయింది. 'ఏదో ఒక మహమ్మారి విజృంభించినప్పుడల్లా సగటు ఆయుష్షు తగ్గిపోతుంటుంది. ఆఫ్రికా దేశాలపై హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ విరుచుకుపడినప్పుడు కూడా ఇది క్షీణించింది. ఆ వ్యాధిని అదుపులోకి తెచ్చాక సగటు ఆయుర్దాయం మళ్లీ పుంజుకుంది' అని ఐఐపీఎస్‌ డైరెక్టర్‌ కె.ఎస్‌.జేమ్స్‌ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ పార్టీలోకి 15 మంది ఎమ్మెల్యేలు : షబ్బీర్ అలీ