Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona: తగ్గిన కొత్త కేసులు, పెరిగిన రికవరీలు

Advertiesment
Corona: తగ్గిన కొత్త కేసులు, పెరిగిన రికవరీలు
, ఆదివారం, 31 అక్టోబరు 2021 (19:36 IST)
దిల్లీ : దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతకుముందు రోజుతో పోల్చితే తాజా కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. 13 వేల దిగువన కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రాలు మరణాల సంఖ్యను సవరిస్తుండటంతో ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..
 
* గడిచిన 24 గంటల్లో 11,35,142 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,830 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
 
* నిన్న 446 మంది కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,58,186కి చేరింది.
 
* కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం కాస్త ఊరట నిచ్చే అంశం. తాజాగా 14,667 మంది కొవిడ్‌ను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3.36 కోట్లు(98.20%) దాటింది.
 
*ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,59,272కి తగ్గి 247 రోజుల కనిష్ఠానికి చేరింది.
 
*ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 68,04,806 మందికి టీకా డోసులు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకూ అందించిన మొత్తం డోసుల సంఖ్య 1.06 కోట్లు దాటింది..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిలబడతా.. పారిపోయే వ్యక్తిని కాదు: విశాఖలో పవన్ కళ్యాణ్