Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో గంటకు ఎన్ని కరోనా కేసులు నమోదంటే...

Webdunia
సోమవారం, 13 జులై 2020 (11:31 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తన విశ్వరూపాన్నిచూపిస్తోంది. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలో ఈ వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంది. ఫలతింగా ప్రతి గంట వ్యవధిలో కొత్తగా 49 మంది వైరస్ బారినపడుతున్నారు. అంటే రోజులో సగటున 1169 కేసులు ఒక్క హైదరాబాద్ పరిధిలోనే వస్తున్నాయి. 
 
వాస్తవానికి ఈ నెల ప్రారంభంలో ఉన్న తీవ్రత ఇప్పుడు కనిపించకపోయినా, కొత్త కేసుల సంఖ్య అధికంగానే ఉందని ఆరోగ్య నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ నెల 3 నుంచి 8 మధ్య రోజుకు 1,270 నుంచి 1,660 వరకూ కేసులు రాగా, ఆపై మాత్రం రోజుకు 1,000 కేసుల లోపే వస్తున్నాయి. 
 
తొలివారంలో రికార్డు స్థాయిలో నమోదైన కేసుల వేగం, ఇప్పుడు దాదాపు సగానికి తగ్గింది. మొత్తం మీద గత 13 రోజుల్లో ఏకంగా 14,033 కేసులు వచ్చాయి. దీంతో అధికారులు మరింత అప్రమత్తమై, కంటెయిన్ మెంట్ జోన్లలో ఆంక్షలను పెంచారు.
 
మరోవైపు, ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో 1269 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎనిమిది మంది చనిపోయారు. 
 
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 800 కేసులు నమోదుకాదా. రంగారెడ్డిలో 132, మేడ్చల్‌లో 94, సంగారెడ్డిలో 36, కరీంనగర్‌లో 23, పాలమూరులో 17, వరంగల్ అర్బన్‌లో 12 చొప్పున కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 11883 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments