Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాక్ డౌన్: నెలలోనే రెండు పెళ్ళిళ్లు చేసుకున్నాడు.. చివరికి ఎలా తెలిసిందంటే?

Advertiesment
లాక్ డౌన్: నెలలోనే రెండు పెళ్ళిళ్లు చేసుకున్నాడు.. చివరికి ఎలా తెలిసిందంటే?
, శనివారం, 11 జులై 2020 (13:25 IST)
లాక్ డౌన్ ముందు ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత భార్యను ఇంటి వద్ద వుంచి ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌లోనే ఇరుక్కుపోయానని చెప్పాడు. కానీ లాక్‌డౌన్‌కు మూడు రోజుల ముందే మరో యువతిని యాదాద్రిలో పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో కాపురం పెట్టాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని నెల రోజుల వ్యవధిలోనే పెళ్లి చేసుకున్నాడు. 
 
కానీ చివరకు ఫోన్ కాల్ ద్వారా విషయం బయటపడడంతో భార్య భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఆ పంచాయతీ కాస్త పోలీసుస్టేషన్‌కు చేరింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా బోధన మండలం అమ్దాపూర్ గ్రామానికి చెందిన కిషన్, అనురాధ దంపతుల కూతురు కె.మనీషకు పట్టణంలోని హనుమాన్ టేకిడీ కాలనీకి చెందిన కలేవార్ శ్రీకాంత్‌తో ఫిబ్రవరి నెలలో పెళ్లి చేశారు. 
 
శ్రీకాంత్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుంటాడు. పెళ్లి తర్వాత శ్రీకాంత్ హైదరాబాద్ వెళ్లాడు. లాక్‌డౌన్‌కు ముందు మార్చి 20న యాదాద్రిలో మంచిర్యాలకు చెందిన వనజను పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లోనే కాపురం పెట్టాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో శ్రీకాంత్ తిరిగి ఇంటికి వచ్చాడు. కొంతకాలం పాటు మనీషతో మంచిగానే ఉన్నాడు. 
 
ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇవ్వడంతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. అయితే అత్తగారి ఇంటి వద్ద ఉన్న మనీష.. హైదరాబాద్‌లో ఉన్న భర్తకు ఫోన్ చేయగా.. వనజ ఫోన్ ఎత్తింది. మనీష మీరు ఎవరని ప్రశ్నించగా శ్రీకాంత్ భార్యనంటూ మనీష బదులిచ్చింది. పెళ్లి ఫొటోలను సైతం పంపించింది. వనజ కూడా వివాహం ఫొటోలు, వీడియోలను వాట్సప్‌లో పంపించింది. 
 
దీంతో మనీష తాను మోసపోయానని గ్రహించి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. తన భర్త శ్రీకాంత్‌తో పాటు వనజ ఒకే ఆస్పత్రిలో పనిచేస్తున్నారని మనీష చెప్పింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా విజృంభణ.. తమిళనాడులో సీనియర్ మంత్రికి పాజిటివ్