భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరిగి పోతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 27,114 కేసులు నమోదయ్యాయి. కాగా 519 మంది ప్రాణాలు కోల్పో యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల మేరకు దేశంలో మొత్తం కేసులు 8,20,916గా ఉండగా, ఇందులో 5,15,385 మంది చికిత్స నిమిత్తం కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా 22,123 మంది కరోనా వ్యాధితో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,82,511 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో 1,13,07,002 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.