ఏపీ ఎంసెట్ జూలై 27నుంచి 31వరకు జరుగనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సెట్స్) వాయిదా పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ పరీక్షల తేదీలను ఉన్నతవిద్యా మండలి ఖరారు చేసింది. జూలై 27 నుంచి 31 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
జూలై 24న ఈసెట్ పరీక్ష జరపనున్నారు. జూలై 25న ఐసెట్ ఎంట్రన్స్ నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అయితే ప్రస్తుత పరీక్షల్లో ఎంసెట్ పరీక్షలు జరపడం అనుమానమేనని తెలుస్తోంది.
ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంలో 1,79,774, అగ్రికల్చర్ మెడిసిన్ విభాగంలో 84,479 మంది, రెండు విభాగాలకు 604 మంది ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ పరీక్షలు జరుగుతాయా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.