Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తర కొరియాలో అడుగుపెట్టేందుకు సాహసం చేయని 'కరోనా'.. కారణం అదేనా?

ఉత్తర కొరియాలో అడుగుపెట్టేందుకు సాహసం చేయని 'కరోనా'.. కారణం అదేనా?
, గురువారం, 26 మార్చి 2020 (13:25 IST)
కరోనా వైరస్ పురుడు పోసుకున్న చైనాకు పక్కన ఉన్న దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. చైనాలోను వుహాన్ నగరాన్ని అల్లకల్లోలం సృష్టించిన ఈ వైరస్.. ఉత్తర కొరియాలో మాత్రం ప్రవేశించలేదు. పైగా, దక్షిణ కొరియాలో మాత్రం ప్రవేశించి అనేక మందిని హతమార్చింది. కానీ ఉత్తర కొరియాలోకి మాత్రం అడుగుపెట్టలేక పోయింది. దీనికి కారణం ఏంటి? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు.. కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టిన చైనా.. ఆ మందును తమ మిత్రదేశాలైన ఉత్తర కొరియా, రష్యా దేశాలకు ముందుగా సరఫరా చేసింది. అందుకే రష్యా, ఉత్తర కొరియాల్లో ఒక్కటంటే ఒక్క కేసు కుడా నమోదు కాలేదన్నది సోషల్ మీడియాలో నెటిజన్లు చేస్తున్న కామెంట్స్.
 
కానీ, ఇక్కడే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించారు. ప్రపంచం నలుమూలలా కరోనా వల్ల ఇంత కల్లోలం చెలరేగుతున్నా.. ఉత్తర కొరియాలో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విస్తుగొలిపే విషయం. కరోనా తమ దేశంలోకి అడుగుపెడితే.. తీవ్ర పరిణామాలుంటాయ్ అని ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరించారు. ఇంతకి ఏమిటీ హెచ్చరిక కథ అని అంటారా? 
 
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ వాలకం చూస్తే అందరూ ఏదో అనుకుంటారు. కానీ, ఫిబ్రవరి 29వ తేదీన ఈ పొట్టిసార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరికో తెలుసా? తమ పార్టీలోని ప్రధాన అధికారులకి. కరోనా తమ దేశంలోకి ప్రవేశిస్తే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీచేశారు. పొరుగున ఉన్న దక్షిణ కొరియాలో కరోనా వైరస్ వల్ల అనేక మంది ప్రజలు మరణిస్తున్నారని తెలియడంతో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.
 
అసలే పేద దేశం, అత్యాధునిక రీతిలో ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి చెందలేదు. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా పక్క దేశాలతో ఉన్న సరిహద్దుల్ని పూర్తిగా మూసేయించారు. పర్యాటకుల్ని రానీయకుండా అడ్డుకట్ట వేయించారు. రైళ్లు, అంతర్జాతీయ విమానాల్ని రద్దు చేయించారు. క్వారంటైన్ చర్యల్లో భాగంగా విదేశీయులను దేశంలో నుంచి బయటికి పంపించేయించారు. స్కూలు విద్యా సంవత్సరాన్ని కూడా పూర్తిగా మార్చేసింది. అందుకే, ఆ దేశంలోకి కరోనా అడుగుపెట్టలేదని సమాచారం. ఏది ఏమైనా కరోనా వైరస్ బారినపడిన దేశాలు ఉత్తర కొరియా చూసి చాలా నేర్చుకోవాల్సివుందని చెప్పొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాల ప్యాకెట్ కోసం వెళ్తే పోలీసులు కొట్టి చంపేసారు.. ఎక్కడ?