Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కజిస్థాన్‌లో అంతుచిక్కని వ్యాధి.. కరోనా వైరస్ కంటే ప్రాణాంతకమట...

Advertiesment
Kazakhstan
, శుక్రవారం, 10 జులై 2020 (15:32 IST)
కజికిస్థాన్‌లో ఓ అంతు చిక్కని వ్యాధి సోకింది. దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఆరు నెలల్లో 1772 మంది చిపోయినట్టు ఆ దేశ అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని చైనా మీడియా కూడా ధృవీకరించింది. 
 
చైనాకు పొరుగు దేశంగా ఉన్న కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్ ఒకటి ప్రబలి, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు చైనా మీడియా పేర్కొంది. దీనిపట్ల ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని కజకిస్థాన్‌లోని చైనా ఎంబసీ ఆ దేశంలోని తమ ప్రజలకు సూచనలు చేసింది. 
 
ఓ వైరస్‌ సోకుతుండడంతో న్యుమోనియాతో జూన్‌లో ఏకంగా 628 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ కంటే ఇది అత్యంత ప్రమాదకరమైనదని వివరించింది. ఆరు నెలల్లోనే 1,772 మంది మృతి చెందారని చెప్పింది. ఒక్క జూన్‌ నెలలోనే 628 మంది మృతి చెందారు.
 
కజకిస్థాన్‌లోని చైనీయులు కూడా చా లామంది ఈ వైరస్‌ బారినపడి మృతి చెందారు. ఆ కొత్త వైరస్‌ గురించి విశ్లేషించేందుకు వైద్య నిపుణులు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఇప్పటికీ దాన్ని గురించిన పూర్తి వివరాలు కనిపెట్టలేకపోయారు. 
 
కజకిస్థాన్‌లో కరోనా సోకిన వారి కంటే కూడా గుర్తు తెలియని మరో కొత్త వైరస్‌ వల్ల మృతి చెందిన వారి సంఖ్య అధికంగా ఉందని చైనా మీడియా ప్రకటించింది. నిజానికి కజకిస్థాన్‌లో వైద్య సేవలు అంతంతమాత్రంగానే ఉంటాయి. దీనికితోడు కరోనా, అంతుచిక్కని వ్యాధితో అనేక మంది ప్రాణాలు కోల్పోతుండటం ఆ దేశ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు తాత్కాలిక బ్రేక్