Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వేళ.. వాకింగ్ చేస్తే ఏంటి ఫలితం? (video)

కరోనా వేళ.. వాకింగ్ చేస్తే ఏంటి ఫలితం? (video)
, శుక్రవారం, 10 జులై 2020 (16:20 IST)
శారీరక శ్రమ లేని ఉద్యోగాలు చేస్తున్న చాలామందిని వేధిస్తున్న సమస్య ఒబిసిటీ. అలాంటి వారు తప్పకుండా నడవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా కరోనా వేళ శరీరం ఫిట్‌గా వుంటే.. కోవిడ్ వల్ల ఇబ్బందులు ఏర్పడవని వారు సెలవిస్తున్నారు. అందుకే వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారంలో పాటు వ్యాయామం, యోగ తప్పనిసరి అంటున్నారు. 
 
రోజువారీ పనుల్లో వాకింగ్‌ను కూడా భాగం చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా వుండగలుగుతారని వైద్యులు చెప్తున్నారు. కరోనా వేళ ఇంటిపట్టున వున్నవారు వాకింగ్ చేయడం.. లేదంటే క్రీడలు ఆడటం.. యోగా చేయడం లేదంటే రన్నింగ్ రేస్ వంటివి చేస్తే.. బరువు తగ్గడంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఇలాంటి వ్యాయామాల ద్వారా శరీరంలో చురుకుదనం ఏర్పడుతుంది. 
 
మెదడు ఉత్తేజితమవుతుంది. అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు. మానసిక ఒత్తిడి వుండదు. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా మధుమేహం వుండదు. మెటబాలిజం ప్రక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి సమస్య వుండదు. నడవటం మన కాళ్లకు మేలు చేస్తుంది. శరీరానికి, మనస్సుకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. శరీరానికి శక్తినిస్తుంది. అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. 
 
ఇంకా సూర్యోదయం.. సూర్యాస్తమయం సమయంలో నడక ద్వారా డి విటమిన్ లభిస్తుంది. అలాగే వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా కరోనా వంటి వైరస్‌ ఆమడ దూరంలోనే నిలిచిపోతుందట. అంతేగాకుండా.. కరోనా వైరస్‌కు జడుసుకుని ఇంటికే పరిమితం అయితే ఒత్తిడి పెరిగిపోతుందని.. అందుకే డాబాపైనో లేదంటే.. ఇంటికి వెలుపల సామాజిక దూరం పాటిస్తూ వాకింగ్ చేయడం మంచిది. 
 
ఇంట్లోనే వుండే వారిలో వ్యాధినిరోధక శక్తి కూడా తగ్గుతుందని.. ఇందుకు సూర్య కిరణాలు శరీరంపై పడకపోవడం కారణమని వైద్యులు చెప్తున్నారు. అయితే బయట వర్కౌట్స్‌కు వెళ్లి ఇంటికి చేరుకోగానే స్నానం చేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గులాబీ రేకులతో బాదంపప్పు పాలు కలిసి తీసుకుంటే? (Video)