బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

ఠాగూర్
మంగళవారం, 18 నవంబరు 2025 (22:18 IST)
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు కీలక విషయాలను పొందుపర్చారు. ఐబొమ్మకి సంబంధించిన రెండు డొమైన్లను రవి ప్రధానంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. rao.ibomma.foo, bappam.dev డొమైన్లతో 65 మిర్రర్ వైబ్‌సైట్లను సృష్టించాడని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఇవన్నీ ఐబొమ్మ, బప్పం టీవీ కింద నడుస్తున్నాయి. పైరసీ చేసిన సినిమాలను ఈ వెబ్‌సైట్లలో పెడుతూ వాటి మధ్యలో వన్‌విన్, వన్‌ఎక్స్‌ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ.. లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడని వెల్లడించారు. 
 
ఐబొమ్మ నుంచి రీడైరెక్ట్ అయి బెట్టింగ్ సైట్లకు వెళ్లడం ద్వారా వ్యక్తిగత డేటా చౌర్యం జరుగుతోంది. కొందరు బెట్టింగ్ యాప్‌ వల్ల జీవితాలను కోల్పోయారు. ఇదంతా పథకం ప్రకారం జరుగుతున్నట్లు దర్యాప్తులో బయటపడింది. నిందితుడు ఇమ్మడి రవి తనకున్న సైబ్‌ స్క్రైబర్లను, సినిమా ప్రొడ్యూసర్లను సైతం బెదిరించాడని, దీనిపై కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశామని పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో వివరించారు. 
 
ముఖ్యంగా, బెట్టింగ్‌ యాప్స్‌కు చెందిన యాడ్స్‌ను ఐ-బొమ్మ, దాని అనుబంధ సైట్లలో ప్లే చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జించిన ఇమ్మడి రవి.... 4 బ్యాంకు ఖాతాల్లోనే రూ.20 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మూడు ఖాతాల్లోని రూ.3 కోట్లకు పైగ నగదును హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఫ్రీజ్ చేశారు. అయితే వచ్చే డబ్బుతో హైదరాబాద్‌లో, కరీబియన్ దీవుల్లో రవి ఇళ్లు కొనుగోలు చేసినట్లు తేల్చారు. ట్రావెలింగ్ చేయడం, విలాస వంతమైన జీవితాన్ని గడపడమే రవి హాబీగా పెట్టకున్నట్లు తెలుస్తోంది. 
 
బెట్టింగ్ యాప్స్ యాడ్స్ ద్వారా వచ్చిన నగదుతో రెండు నెలలకు ఓ దేశం తిరిగేవాడని సమాచారం. సాఫ్ట్‌వేర్ కంపెనీతో నెలకు లక్ష మాత్రమే ఆదాయం వస్తుండటంతో... పైరసీ వైపు మళ్లిన రవి కేవలం యాడ్స్‌ ద్వారానే నెలకు రూ.11లక్షలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగతంగా స్నేహితులు, బంధువులతో రవికి ఎలాంటి సంబంధాలు లేవని, అరెస్ట్ చేసే ముందు కూడా అతను ఫ్రాన్స్  నుంచి వచ్చినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments