హైదరాబాద్‌లో ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐబొమ్మ, బప్పం సైట్లు బ్లాక్ చేయించారు. నెదర్లాండ్స్ నుంచి ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి పైరసీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రకటనలు కూడా రవి ఇచ్చినట్లు గుర్తించారు.
మాజీ భార్యే పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పేరు ట్రెండింగ్‌లో ఉంది. రవికి మిడిల్ క్లాస్ మద్దతిస్తోంది.
ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. థియేటర్ రేట్లు భారీగా పెంచడం వల్లే ఐబొమ్మకు అలవాటు పడ్డామంటూ ట్వీట్లు చేస్తున్నారు. సామాన్యులకు అందనంత రేట్లు పెంచి సినిమా థియేటర్లకు రానివ్వని పరిస్థితి తీసుకువచ్చారని సామాన్యులు ఆరోపిస్తున్నారు.
ఒక కుటుంబం కొత్తగా విడుదలైన సినిమాకు వెళ్లాలంటే వేలాది రూపాయలు వెచ్చించాల్సిందే. అంతా పెట్టి చూడలేని మధ్యతరగతి జనం ఐ బొమ్మకు అలవాటు పడ్డరన్నారు. కోట్లు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు నటులకు కోట్లు చెల్లిస్తారే కానీ, సామాన్యులకు టికెట్ దరలు తగ్గించడంలో మాత్రం అలసత్వం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైన సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా టికెట్‌ధరలు నిర్ణయించాలని ట్వీ్ట్లు చేస్తున్నారు.