Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు షాక్... తాత్కాలిక నిషేధం

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (05:44 IST)
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలిగింది. ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో ఖచ్చితంగా పతకం సాధిస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, రెజ్లర్ వినేశ్ ఫోగాట్ నిరాశ పరిచింది. అంతేకాకుండా, ఇప్పుడో వివాదంలో చిక్కుకుంది. 
 
ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేందుకు హంగేరీ వెళ్లిన వినేశ్ ఫోగాట్ అక్కడ నుంచి టోక్యో చేరుకుంది. ఇతర రెజ్లర్లు భారత్ నుంచి టోక్యో వెళ్లారు. అయితే టోక్యో ఒలింపిక్స్ క్రీడాగ్రామంలో వారితో కలిసి ఉండేందుకు వినేశ్ ఫోగాట్ నిరాకరించింది.
 
తాను హంగేరీ నుంచి వచ్చానని, వారు భారత్ నుంచి వచ్చారని, వారి నుంచి తనకు కరోనా సోకే అవకాశాలు ఉన్నాయన్న వినేశ్ పేర్కొంటూ వారికి దూరంగా ఉన్నారు. భారత బృందంతో కలిసి ఉండకపోగా, వారితో కలిసి ప్రాక్టీసు కూడా చేయలేదట. 
 
అంతేకాదు, మ్యాచ్‌ల సందర్భంగా అధికారిక స్పాన్సర్ కిట్లను కూడా ధరించలేదని భారత రెజ్లింగ్ సమాఖ్య ఆమెపై ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో రెజ్లింగ్ సమాఖ్య భారత్ తిరిగొచ్చిన వినేశ్‌కు నోటీసులు జారీ చేసి, తాత్కాలిక నిషేధం విధించింది. 
 
ఈ నెల 16 లోగా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వినేశ్ తప్పు చేసినట్టు తేలితే మాత్రం శిక్ష తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అటు టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో ఓడిపోయి తీవ్ర నిరాశలో ఉన్న వినేశ్ ఫోగాట్‌కు రెజ్లర్ సమాఖ్య తీసుకున్న నిర్ణయం శరాఘాతంగా మారే ప్రమాదం లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

తర్వాతి కథనం
Show comments