జపాన్ రాజాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ పోటీలు జరుగుతున్నాయి. అయితే, ఈ పోటీల్లో పాల్గొనడానికి వెళ్తున్న ఇండియన్ స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ టోక్యో విమానం మిస్ అయింది. లింపిక్స్‌లో పాల్గొనడానికి ముందు ఆమె తన కోచ్ వోలెట్ అకోస్‌తో కలిసి మెరుగైన శిక్షణ కోసం హంగేరీ వెళ్లింది. యురోపియన్ యూనియన్ వీసాపై ఒకరోజు ఎక్కువగా ఉంది. మంగళవారం రాత్రి టోక్యో విమానం ఎక్కడానికి వచ్చిన ఆమెను అధికారులు అడ్డుకున్నారు. తాను ఎక్కాల్సిన విమానం వెళ్లిపోవడంతో వినేష్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వినేష్ ఫోగట్ విమానం మిస్ అయినట్లు తెలుసుకున్న ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) రంగంలోకి సమస్యను పరిష్కరించింది. వినేష్ బుధవారం టోక్యో వెళ్తుందని ఐవోఐ స్పష్టం చేసింది. 'వినేష్ ఫోగట్ వీసా గడువు సరిగా చూడలేదు. ఇది కావాలని చేసింది కాదు. ఆమె 90 రోజుల పాటు అక్కడ ఉండాల్సి ఉండగా.. ఆమె ఫ్రాంక్‌ఫర్ట్ చేసే సరికి 91వ రోజు అయింది' అని వెల్లడించింది. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లగా వాళ్లు వెంటనే జర్మనీలోని ఇండియన్ కాన్సులేట్‌కు సమాచారాన్ని చేరవేశారు. కాగా మంగళవారం రాత్రి ఫ్రాంక్‌ఫర్ట్‌లోనే ఉన్న వినేష్‌కు మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేశారు. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్లలో ఎన్నో పతకాలు గెలిచిన వినేష్‌పై టోక్యో ఒలింపిక్స్‌లో ఈసారి మంచి అంచనాలు ఉన్నాయి. కాగా 53 కేజీల ఉమెన్ ఫ్రీస్టైల్ కేటగిరీలో పోటీ పడుతున్న వినేష్ ఒలింపిక్స్‌లో ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది.