వాటిని చిరునవ్వుతో స్వీకరిస్తే జీవనభారం తగ్గుతుంది...

Webdunia
మంగళవారం, 7 మే 2019 (22:20 IST)
వ్యక్తి యెుక్క పూర్వ కర్మల ఫలితాల ననుసరించి జయాపజయాలు, సాధనా నిస్పృహలు, ఆకర్షణలు పని చేస్తుంటాయి. ఈ వరుస క్రమంలో అన్ని జరుగువలసిందే. అందరూ అనుభవించ వలసినవే. అవాంఛనీయ సంఘటనలు తటస్థించినా వానిని చిరునవ్వుతో స్వీకరిస్తే మన జీవన భారం కొంత తేలిక పడుతుంది.
 
1. ఇతరుల తప్పిదాలు అవి ఎంత చెడ్డవైనా వాని విషయం ఎన్నడూ ఎవ్వరితో ప్రసంగించకండి. దాని వల్ల ఉపయోగమేమీ లేదు. 
 
2. ద్వేషపూరిత హృదయానికి సంతృప్తి కలుగదు. ద్వేషం కార్చిచ్చు వంటిది. శాస్త్రాధ్యయనం వలన మానవుడు మేధావి కాలేడు. మహాత్ముల దైనందిక కార్యములందు సన్నిహితాన్ని పెంపొందించుకొనగలిగిన వాడే జ్ఞానియై రాణించగలడు.
 
3. దైవ చింతనతో గడుపుతున్న జీవితం స్వల్పకాలమైనా ఉత్తమమైనదే. దైవ భక్తి లేని జీవి లక్షలాది సంవత్సరాలు బ్రతికి ఉన్న ప్రయోజనం శూన్యమే.
 
4. కష్టపడి పనిచేయి. దేవుడు నామము ఉచ్చరించు. సద్గ్రంధాలు చదువు. వంతులకు, పోటీలకు పోవద్దు. అలా చేస్తే  భగవంతునికి ఏహ్యం కలుగుతుంది.
 
5. మన సంభాషణ యందు మనం సత్యాన్ని ఆచితూచి పలకాలి. సాధకుడు మితభాషిగా ఉండాలి. 
 
6. దైవాన్ని మరచిన వారికి బలహీనత కలుగుతుంది. పరమేశ్వరుని జ్ఞాపకముంచు కొనవలనంటే వాని మహిమను, నామాన్ని స్మరించడం అవసరం.
 
7. కష్టాలను అధిగమించితే మనకు నూతనుత్తేజం, ఆధ్యాత్మిక బలం చేకూరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెనిజులాపై దాడి: ట్రంప్ చేసింది చాలా బాగోలేదు, ప్రపంచ దేశాలు అసంతృప్తి

తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

విధుల నుంచి ఎస్పీ సస్పెన్షన్... మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్‌ పార్టీకి విజయ్ స్నేహాస్తం... పొత్తుకు సంకేతాలు

ఫోన్లు దొంగిలిస్తున్నాడనీ కొడుకును ఇనుప గొలుసుతో కట్టేసిన తల్లిదండ్రులు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-01-2026 గురువారం ఫలితాలు - పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు...

01-01-2026 నుంచి 31-01-2026 వరకు జనవరి మాస ఫలితాలు

ముక్కోటి ఏకాదశి: 5 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారం చేస్తూ వెళ్లిన దంపతులు (video)

31-12-2025 బుధవారం ఫలితాలు - పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు...

Sabarimala: శబరిమలలో మకరవిళక్కు ఉత్సవాల సీజన్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments