Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ వంకర వెంట్రుకని తిన్నగా చెయ్యమని చెప్పు....

ఒకప్పుడు ఒకడు భూతాలను లొంగదీసుకునే శక్తి గడించాడు. ఆ శక్తి కలిగాక అతడు పిలవగానే భూతం అతడి ఎదుట ప్రత్యక్షమై ఇలా అంది. నేనిప్పుడు ఏం పని చేయాలో చెప్పు... నువ్వు నాకు ఏ పని అప్పగించనట్లయితే ఆ మరుక్షణమే నీ మెడను త్రుంచి వేస్తాను అని అంది. అప్పుడా వ్యక్తి

ఈ వంకర వెంట్రుకని తిన్నగా చెయ్యమని చెప్పు....
, సోమవారం, 16 జులై 2018 (21:14 IST)
ఒకప్పుడు ఒకడు భూతాలను లొంగదీసుకునే శక్తి గడించాడు. ఆ శక్తి కలిగాక అతడు పిలవగానే భూతం అతడి ఎదుట ప్రత్యక్షమై ఇలా అంది. నేనిప్పుడు ఏం పని చేయాలో చెప్పు... నువ్వు నాకు ఏ పని అప్పగించనట్లయితే ఆ మరుక్షణమే నీ మెడను త్రుంచి వేస్తాను అని అంది. అప్పుడా వ్యక్తి తనకు కావలసిన పనులన్నింటిని ఆ భూతం ద్వారా ఒక్కొక్కటిగా చేయించుకున్నాడు. చివరకు ఆ భూతానికి ఇవ్వడానికంటూ అతడి వద్ద ఏ పని లేకుండా పోయింది. ఇప్పుడు నీ మెడ త్రుంచి వేస్తాను అంది ఆ భూతం. 
 
పాపం ఆ వ్యక్తికి ఏం చేయాలో పాలుపోలేదు. ఒక్క క్షణం ఆగు. నేనిప్పుడే వస్తాను అని చెప్పి అతడు తన గురువు వద్దకు పరుగుపరుగున వెళ్లాడు. ఆయనకు ఈ ఉదంతాన్ని తెలిపి అయ్యా... నేనొక పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాను. ఇదీ సంగతి... నేను ఇందులో నుండి బయటపడటం ఎలాగో సెలవియ్యండి అన్నాడు. 
 
గురువుగారు అతనికి వంకర టింకరగా ఉన్న వెంట్రుకను ఒక దానిని ఇచ్చారు. దానిని ఆ భూతానికి ఇచ్చి వెంట్రుకని తిన్నగా చెయ్యమని చెప్పు అన్నారు. ఆ భూతం రాత్రింబవళ్లు ఆ వెంట్రుకను తిన్నగా చెయ్యడంలోనే నిమగ్నమైపోయింది. కానీ.... ఆ వెంట్రుక ఎప్పటికైనా తిన్నగా అయ్యేదేనా? అది ఎలా వంకరగా ఉండేదో అలాగే ఉంది. 
 
అహంకారం కూడా అలాంటిదే. క్షణంలో తొలగిపోయినట్లుంటుంది. మళ్లీ అంతలోనే ప్రత్యక్షమవుతుంది. అహంకారాన్ని త్యజించకుండా భగవత్కృప లభించదు. ఇంట్లో విందు భోజనం ఏర్పాటు చేసినప్పుడు ఇంటి యజమాని వంట సామాన్ల గదిని చూసుకునే బాధ్యతను ఒక వ్యక్తికి అప్పగించాడనుకుందాం....
 
సామాన్ల గదిలో ఆ వ్యక్తి ఉన్నంతవరకు యజమాని ఆ పనిలో జోక్యం చేసుకోడు. కానీ ఆ వ్యక్తి తన ఇచ్ఛ మేరకు ఆ పనిని వదిలిపెట్టి పోయినప్పుడు యజమానే స్వయంగా వచ్చి ఆ పనిని చేపడతాడు. గదికి తాళం వేసి సామాన్ల బాధ్యతను స్వీకరిస్తాడు. అహంకారాన్ని త్యజింపనిదే భగవంతుడు మన భారాన్ని స్వీకరించడు.
- శ్రీరామకృష్ణ పరమహంస 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరస్వతి దేవికి ఇష్టమైన నైవేద్యాలు... విద్యార్థులు ఆచరించాల్సినవి