Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అపజయాలు లేని జీవితం ఒక జీవితమేనా?

నేను జీవితంలో అనేక తప్పులను చేశాను. కాని ఆ తప్పులలో ఏది లేకున్నా, నేను ఈ స్థితికి వచ్చివుండకపోయేవాణ్ణి అనడం నిస్సంశయం. కాబట్టి వాటికి నేను కృతజ్ఞుణ్ణి. అలాగని మిమ్మల్ని బుద్ధిపూర్వకంగా తప్పులను చేయమని చెప్పడం లేదు. కాని తప్పులను చేస్తే విలపించకు.

Advertiesment
అపజయాలు లేని జీవితం ఒక జీవితమేనా?
, సోమవారం, 14 మే 2018 (19:39 IST)
నేను జీవితంలో అనేక తప్పులను చేశాను. కాని ఆ తప్పులలో ఏది లేకున్నా, నేను ఈ స్థితికి వచ్చివుండకపోయేవాణ్ణి అనడం నిస్సంశయం. కాబట్టి వాటికి నేను కృతజ్ఞుణ్ణి. అలాగని మిమ్మల్ని బుద్ధిపూర్వకంగా తప్పులను చేయమని చెప్పడం లేదు. కాని తప్పులను చేస్తే విలపించకు.
ఫోటో కర్టెసీ - ఇషా ఆర్గ్
 
2. జరుగవలసింది ఏదో జరిగిపోయింది. చింతించకు. జరిగిపోయిన కార్యాలను గూర్చి పదేపదే తలపోయకు. వాటిని నీవు రద్దు చేయలేవు. కర్మఫలం కలిగే తీరుతుంది. దానిని ఎదుర్కో... కాని చేసిన తప్పునే మరలా చేయకుండా జాగ్రత్త వహించు.
 
3. మనం చేసే పనులలోని తప్పులూ, పొరపాట్లే మనకు నిజంగా బోధను నేర్పుతాయి. తప్పులు చేసేవారే సత్యపథంలో విజయాన్ని సాధిస్తారు. చెట్లు తప్పులు చేయవు. రాళ్లు పొరపాట్లలో కూరుకోవు. జంతువులు ప్రకృతి నియమాలను అధిగమించడం సాధారణంగా చూడం. కానీ మనిషి తప్పులను చేసే అవకాశం ఉంది. మళ్లీ మనిషే భువిపై దైవంగా మారతాడు. 
 
4. పురోగమించు... యుగయుగాల సంఘర్షణ ఫలితంగానే సౌశీల్యం నిర్మితమవుతుంది. అధైర్య పడవద్దు. 
 
5. అపజయాలను లక్ష్యపెట్టకు. అవి వాటిల్లడం సహజం. ఈ అపజయాలు జీవితానికి అలంకారప్రాయాలు. ఇవి లేని జీవితమూ ఒక జీవితమేనా... పోరాటానికి సంసిద్ధం చేసేవి ఈ అపజయాలే కదా. ఇవే జీవిత సౌరభాలు. కాబట్టి ఈ పొరపాట్లను, ఈ పోరాటాలను లక్షించవద్దు. ఆవు అసత్యమాడదు నిజమే. కాని అది ఎప్పటికీ ఆవే... మనిషి కాలేదు. కాబట్టి అపజయాలచే నిరుత్సాహపడకండి. లక్ష్యసిద్ధికై వేయిసార్లు పోరాడండి. వెయ్యిసార్లు ఓటమి వాటిల్లినా, ఇంకొకసారి మళ్లీ ప్రయత్నించండి. 
 
6. వేల అవరోధాలను అధిగమించినప్పుడే సౌశీల్య నిర్మాణం సాధ్యమవుతుంది.
 
7. ఇతరుల దోషాల గురించి, వారెంత దుష్టులయినాసరే ఎన్నడూ ముచ్చటించకు. తద్వారా ఏ మేలు కలుగదు. ఒకరి తప్పులను ఎంచి అతనికి నీవు చేయగల సహాయం ఏదీ లేదు. అటువంటి పనుల వల్ల నీవు అతనికి హాని చేసి, నీకు నీవే హాని చేసుకుంటావు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో బంగారు బల్లిని ముట్టుకుంటే?