Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అటువంటి వ్యక్తే ఈ లోకంలో ఎక్కువ దుఃఖాన్ని అనుభవించేది

అటువంటి వ్యక్తే ఈ లోకంలో ఎక్కువ దుఃఖాన్ని అనుభవించేది
, బుధవారం, 24 ఏప్రియల్ 2019 (21:43 IST)
1. ఏదో ఒక ఆదర్శాన్ని కలిగి ఉన్న వ్యక్తి వెయ్యి పొరపాట్లు చేస్తే, ఏ ఆదర్శము లేనివాడు యాబైవేల పొరపాట్లు చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి ఒక ఆదర్శం కలిగి ఉండడం మంచిది. 
 
2. ఈ జీవితం క్షణికం. ప్రాపంచిక భోగాలు అశాశ్వతాలు. ఇతరుల కొరకు జీవించే వారే యధార్ధంగా జీవిస్తున్న వారు. తక్కినవారు జీవన్మృతులు.
 
3. ఈ ప్రపంచం అనే నరకంలో ఏ ఒక్క హృదయంలో ఏ కాస్తయినా శాంతి సౌఖ్యాలు కలిగించగలిగితే అదే సత్కర్మ అనిపించుకుటుంది. జీవితమంతా యాతనలు పడ్డాక ఈ రహస్యం తెలుస్తుంది. తక్కినదంతా కేవలం బూటకం.
 
4. నాయనా.. మృత్యువు అనివార్యమైనపుడు, రాళ్లు రప్పల్లాగా ఉండటం కంటే ధీరుల్లాగా మరణించటం శ్రేయస్కరం కాదా.. ఈ అశాశ్వతమైన ప్రపంచంలో ఇంకా ఒకటి రెండు రోజులు ఎక్కువ బ్రతికి ప్రయోజనమేముంది. తుప్పు పట్టేకంటే, ఈషణ్మాత్రమైనా పరులకు మేలు చేయటంలో అరిగిపోవటం మంచిది.
 
5. నిలువెల్లా స్వార్దం నిండిన వ్యక్తే ఈ లోకంలో ఎక్కువ దుఃఖాన్ని అనుభవించేది. స్వార్థం లేశమైనా లేని వ్యక్తే పరమానందాన్ని పొందేది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనుమంతుడు లాగితే.. నాగుపాము పైకి వచ్చింది..