యూ సిల్లీ, ఇప్పుడవన్నీ ఎందుకని వెళ్లిపోయింది... ఏం చేయాలి?

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (13:56 IST)
కాలేజీ చదివే రోజుల్లో నా క్లాస్‌లో చదివే అమ్మాయి నాతో చనువుగా ఉండేది. ఫైనల్ ఇయర్ చదివేటపుడు ఇక కాలేజీ నుంచి వెళ్తామనగా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. ఆమె ప్రపోజల్‌ను అప్పుడు తిరస్కరించా. ఇపుడు ఆమె ఓ మంచి కంపెనీలో స్థిరపడింది. నేను కూడా ఆమె కంపెనీకి ప్రక్కనే ఉన్న మరో కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ఓసారి రోడ్డుపై కనబడి హాయ్ అని పలుకరించి వెళ్లిపోయింది. ఆమె చాలా అందంగానూ, స్టయిల్‌గా మారిపోయింది. 
 
ఆమెతో మాట్లాడాలని రోజూ రోడ్డుపై పడిగాపులు కాస్తుంటాను. ఈమధ్య ఓరోజు హాయ్ చెప్పి టీకి పిలిచాను. ఆమె కాదనకుండా వచ్చింది. అప్పుడు గతం తాలూకు జ్ఞాపకాలు, లవ్ ప్రపోజల్ గురించి చెప్పాను. ఆమె దాని గురించి పట్టించుకోలేదు. అదంతా అప్పుడు సిల్లీగా ఏదో జరిగిపోయిందని టీ తాగుతూ ఇంకా గుర్తుపెట్టుకున్నావా, నేనెప్పుడో మర్చిపోయానని చెప్పి వెళ్లిపోయింది. కానీ నాకు మాత్రం ఆమె కావాలనిపిస్తోంది. ఆమె మాటలను బట్టి నన్ను మాత్రం పెళ్లి చేసుకోదని అర్థమైపోయింది. కనీసం ఒక్కసారైనా ఆమెతో శృంగారం చేయాలనిపిస్తోంది. అడిగితే ఏం చెపుతుందీ...?
 
మీతో జన్మలో మాట్లాడకపోవచ్చు. ఆమె మీపై ప్రేమ పెంచుకుని వ్యక్తపరిచినపుడు దూరం పెట్టేశారు. అంటే... అపుడు మీకు ఆమె నచ్చలేదు. ఇపుడు మంచి ఉద్యోగంలో స్థిరపడింది. ఇపుడు కూడా మీరు పిలిస్తే మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్లిపోవచ్చు. కానీ సాటి మనిషిగా మీతో టీ తాగేందుకు వచ్చింది. 
 
ప్రేమ గురించి ఇప్పుడు మీరు కొత్త కబుర్లు చెప్పినా ఆమె అనుభవంలో మీరు తనను కాదన్న వ్యక్తిగా మిగిలి ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఆమె నుంచి ప్రేమనే కాదు ఏదీ ఆశించజాలరు. పైగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేయకుండా ఆమెతో శృంగారంలో పాల్గొంటే చాలు అని మీరు అనుకోవడాన్ని చూస్తే అది కామ వాంఛ అని అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఆలోచనలు మానుకుని బుద్ధిగా ఉద్యోగం చేసుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments