Publish Date: Thu, 18 Jul 2019 (21:28 IST)
Updated Date: Thu, 18 Jul 2019 (21:30 IST)
పిడుగులు పడినప్పుడు పెద్దలు అర్జునా, ఫల్గుణా అని అంటారు. దాని వెనుక ఉన్ని పరమార్దం ఏమిటి? ఈ విషయం వెనుక మహాభారత గాధ ఉంది. అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని శమీవృక్షం దగ్గరకు తీసుకువస్తాడు. ఉత్తర గోగ్రహణం ద్వారా గోవుల్ని తరలించుకుపోతున్న దుర్యోధన, కర్ణాదులను ఎదుర్కోవడానికి ఆయుధాలను చెట్టు మీద నుండి దించమంటాడు.
ఉత్తర కుమారుడు భయపడుతుంటే... అది చూసి అర్జునుడు, తనకు ఉన్న పది పేర్లు(అర్జునా, ఫల్గుణా, పార్ధ, కిరీటీ, శ్వేతవాహన, బీభత్సు, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనుంజయ) చెప్పి , భయాన్ని పోగొడతాడు. అప్పటి నుండి ఎలాంటి భయం కలిగినా అర్జునా, ఫల్గుణా..... అని తలుచుకోవడం మొదలయ్యింది. అయితే యుద్ధంలో అర్జునుడి రధ చక్ర శూల విరిగిపడిందని, అదే పిడుగు అయ్యిందని నమ్మకం ఉండటంతో, పిడుగు పడినప్పుడు ప్రత్యేకంగా అర్జునుడి పేర్లు తలుస్తారు.
సిహెచ్
Publish Date: Thu, 18 Jul 2019 (21:28 IST)
Updated Date: Thu, 18 Jul 2019 (21:30 IST)