ర‌జ‌నీకాంత్ జోష్‌కి ఎన్ని సంవ‌త్స‌రాలో తెలుసా..?

సోమవారం, 19 ఆగస్టు 2019 (16:15 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని వారు ఉండరు. తమిళ సినీ పరిశ్రమ స్థాయిని జాతీయ స్థాయిలోనేకాకుండా భారతదేశం నాలువైపులా పెంచి అందరూ గర్వపడేలా విదేశాల్లో కూడా తన క్రేజ్‌ను పెంచుకున్న నటుడు రజినీకాంత్ అలియాస్ శివాజీ రావ్ గైక్వాడ్. 
 
మహారాష్ట్రలో జన్మించిన ఓ కానిస్టేబుల్ కొడుకు బస్‌కండక్టర్ నుంచి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైన తనదైన స్టైల్‌తో జోష్ నింపే స్థాయికి వెళ్లాడు. తలైవా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నలభై ఏళ్ళు దాటింది. 1975లో ఆగస్టు 18న రిలీజైన "అపూర్వ రాగంగల్" తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైన రజినీకాంత్ అతి తక్కువ కాలంలోనే సూపర్ స్టార్‌గా ఎదిగాడు. 
 
చూస్తుండగానే తన సినిమాలతో రాష్ట్రాలనేకాకుండా దేశం మొత్తంలో తన క్రేజ్‌ను పెంచుకున్నాడు. బాషా, ముత్తు, అరుణాచలం, నరసింహా, శివాజీ, రోబో వంటి ఎన్నో సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో తలైవా 44 ఇయర్స్ ఆఫ్ రజిని ఇజం కామన్ డిపి వైరల్ అవుతోంది. ప్రస్తుతం రజినీకాంత్ మురగదాస్ దర్శకత్వంలో "దర్బార్" అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రభాస్ ఒడిలో కూర్చుని చేతిలో గన్ పట్టుకొని శ్రద్ధాదాస్ ఏం చేస్తోంది..?