Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరివెన్నెల వాన పాట... వినాల్సిందే (Video)

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (16:08 IST)
సినీ గేయ రచయితల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రికి ప్రత్యేక స్థానం ఉంది. ఆక్రోశం, ఆవేదన, ప్రేమ, విరహం, హాస్యం ఇలా వివిధ నేపథ్యాలకు పాటలు వ్రాసి, తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గేయరచయితల్లో శాస్త్రి గారు గుర్తుండిపోతారు. తెలుగు పాటలు కరువైపోతున్న కాలంలో కూడా తన కలంతో తెలుగు భాషకు పట్టాభిషేకం చేస్తున్న శాస్త్రి గారు రచించిన పాటలు చాలా మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. 
 
శాస్త్రి గారు చేస్తున్న కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. కాస్త ఆలస్యం అయినప్పటికీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. శ్రాస్త్రి గారు రచించిన పాటలలో ఇప్పుడు మనం ఒక పాటను గుర్తు చేసుకుందాం.
 
తరాలు మారినా, యుగాలు మారినా, హీరోలు మారినా, హీరోయిన్‌లు మారినా భాష మాత్రం అలాగే ఉంటుందని చెప్పేందుకు నిదర్శనంగా ఉండే ఒక మధుర గీతం - చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా అనే పాట అమ్మాయి యొక్క మనస్థత్వాన్ని సినిమాలో కళ్లకు కట్టినట్టు ఆవిష్కృతం చేసారు శాస్త్రి గారు. 
 
ఇందులో నటించిన ఉదయకిరణ్, ఆర్తీ అగర్వాల్, సుజాత ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి నటన మనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. స్వచ్ఛమైన తెలుగు పదాలతో రాసిన ఆ గీతం ఆ సంవత్సరం నంది అవార్డుల్లో ఉత్తమ గాయని అవార్డును తెచ్చిపెట్టింది. ఆ పాటను మీరు కూడా ఓసారి చూడండి.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments