Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''పడి పడి లేచె మనసు''.. ''కల్లోలం వెంటేసుకొచ్చే పిల్లగాలే..'' (video)

Advertiesment
''పడి పడి లేచె మనసు''.. ''కల్లోలం వెంటేసుకొచ్చే పిల్లగాలే..'' (video)
, సోమవారం, 3 డిశెంబరు 2018 (13:15 IST)
శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించే ''పడి పడి లేచె మనసు'' సినిమా ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక లిరికల్ సాంగ్ వీడియోను సినీ యూనిట్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. 
 
ఈ లిరికల్ సాంగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు చెందిన ''కల్లోలం వెంటేసుకొచ్చే పిల్లగాలే..'' అంటూ సాగే లిరికల్ సాంగ్ వీడియో టాలీవుడ్ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది. 
 
ఈ లిరికల్ వీడియోలో పాటల రచయిత కృష్ణకాంత్ కూర్చిన పదాలు బాగున్నాయి. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట మంచి ఫీల్‌తో యూత్‌ను ఆకట్టుకుంటోంది. పడి పడి లేచే మనసులోని కల్లోలం వెంటేసుకొచ్చే పిల్లగాలే లిరికల్ వీడియో సాంగ్‌ను ఓ లుక్కేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుర్ర హీరోయిన్ కావాలంటున్న రాజమౌళి...