Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఠాగూర్
గురువారం, 21 ఆగస్టు 2025 (16:11 IST)
కేరళ రాజకీయాల్లో ఓ యువ కాంగ్రెస్ నేతపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాహుల్ మమూటథిల్‌పై ఓ నటి, రచయిత్రి చేసిన ఆరోపణలతో ఆయన తీవ్ర ఇరకాటంలో పడ్డారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఆందోళనలకు దిగడంతో రాజకీయంగానూ కలకలం రేగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మలయాళ నటి రిని ఆన్ జార్జ్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ చేశారు. ఓ యువ రాజకీయ నాయకుడు తనకు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడని, హోటల్‌కు రమ్మంటూ వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తన పోస్టులో ఆమె ఎవరి పేరునూ ప్రస్తావించలేదు.
 
ఈ పోస్టు ఆధారంగా బీజేపీ రంగంలోకి దిగింది. ఆరోపణలు ఎదుర్కొంటోంది యూత్ కాంగ్రెస్ నేత రాహుల్ మమూటథిల్ అని ఆరోపిస్తూ, ఆయన తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బీజేపీ నాయకులు నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు.
 
ఆ సమయంలో రచయిత్రి హనీ భాస్కరన్ కూడా రాహుల్ మమూటథిల్‌పై ఆరోపణలు చేయడం ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. రాహుల్ గతంలో సోషల్ మీడియా ద్వారా తనను కూడా ఇదే విధంగా వేధించారని ఆమె ఆరోపించారు. ఒకరి తర్వాత మరొకరు ఇద్దరు మహిళలు ఒకే నేతపై ఆరోపణలు చేయడంతో ఈ విషయం కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. పార్టీలోనూ కొందరు మహిళా నేతలను కూడా ఆయన ఇబ్బంది పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం