Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌పోర్టులో షార్క్... సెల్ఫీ ప్లీజ్ అంటూ ఎగబడుతున్న జనం

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (13:36 IST)
సాధారణంగా షార్క్ (సముద్రపు చేపలు) చేపలు సముద్రగర్భంలో ఉంటాయి. వాటిని చూస్తేనే భయపడిపోతాం. అలాంటి షార్క్ చేప.. ఏకంగా విమానాశ్రయంలో కనిపిస్తే... ఇంకేముంది.. భయంతో వణికిపోవాల్సిందే. తాజాగా ఓ విమానాశ్రయంలో షార్క్‌ చేపను చూసినవారంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత సెల్ఫీల కోసం ఎగబడ్డారు. షార్క్ చేప ఏంటి.. ఎయిర్‌పోర్టుకు రావడమేంటి.. దాంతో సెల్ఫీలు దిగడం ఏంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రాయర్ ఈ190-ఈ2 అనే కమర్షియల్ విమానం ఎంతో ప్రత్యేకమైంది. ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన సీట్లతో పాటు సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఇది కేవలం షార్క్ రూపంలోనే కాదు.. పులి, గ్రద్ద ముఖాలతో కూడా ఈ విమానం మోడళ్లను రూపొందించడం జరిగింది.
 
పైగా, ఇంధనం ఆదా చేసేలా దీన్ని తయారు చేశారు. ఈ విమానాన్ని తక్కువ ధరలకే అందుబాటులోకి తెస్తామని ఎంబ్రాయర్ నిర్వాహకులు ప్రకటించారు. ఈ విమానం సేవలు కూడా భారత్‌లో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. కానీ, ఈ విమానంలో ప్రయాణించకపోయినా... ఈ విమానాన్ని చూసిన వారు మాత్రం సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. 
 
ఈ తరహా విమానం ఒకటి ఈనెల 14వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. దీన్ని చూసివారంతా నోరెళ్లబెట్టారు. ఆ తర్వాత తేరుకుని విమానం ముందు నిలబడి సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. రకరకాల కోణాల్లో సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో షార్క్ విమానం ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

Madhumita : శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం గోదారికే సోగ్గాన్నే విడుదల

Srileela: వార్నర్ క్రికెట్ లో వుంటే వికెట్స్ అంటారు, రాబిన్ హుడ్ కోసం టికెట్స్ అంటారు : శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments